షాక్: స్కూల్లోనే టీచర్‌ ఏం చేశారంటే (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu
  స్కూల్లో టీచర్‌ ఏం చేశాడో మీరే చూడండి (వీడియో)

  భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థితో మసాజ్ చేయించుకొన్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థితో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

  విద్యార్థుల ముందే ఉపాధ్యాయుడు నేలపై పడుకొని ఓ విద్యార్థితో కాలితో మసాజ్ చేయించుకొన్నాడు.ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి దీపక్ జోషి ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేస్తోంది. అయితే అదే సమయంలో ఉపాధ్యాయుడిది తప్పని తేలితే సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థితో మసాజ్ చేయించుకొన్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A teacher in a government school in Madhya Pradesh’s Damoh was caught on camera getting his back massaged by a student. In the video, the teacher is lying face down on the floor, and the student is standing on his back, massaging it with his feet.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి