టీఎన్ నెంబర్ కనపడింది: దుమ్ములేపేశారు

బెంగళూరు: కావేరి జలాల వివాదంతో కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ సందర్బంగా తమిళనాడుకు చెందిన పలు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వాహనాల మీద టీఎన్ అని కనపడితే సహనం కొల్పోయారు.

బెంగళూరు నగరంలోని జయనగర 3వ బ్లాక్ లో ఓ ప్రార్థనా మందిరం ముందు తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న కారు పార్క్ చేశారు. ర్యాలీగా వెలుతున్న కన్నడ సంఘాల నాయకులు, కార్య కర్తలు ఆ కారును గుర్తించారు.

Cauvery disput: Karnataka set to observe total Bandh

సహనం కొల్పోయిన ఆందోళనకారులు కారును ధ్వంసం చేశారు. సిల్క్ బోర్డు జంక్షన్ దగ్గర తమిళనాడు వైపు వెలుతున్న ఐదుకార్లు, నాలుగు బైక్ లు ధ్వంసం చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన తమిళనాడు లారీల మీద రాళ్ల వర్షం కురిపించారు.

Cauvery disput: Karnataka set to observe total Bandh

తమిళనాడు ప్రభుత్వానికి చెందిన బస్సులు ఇక్కడి శాంతినగర్ లో పార్క్ చేశారు. ఆ వాహనాలను ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. తమిళనాడు బస్సులకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Cauvery disput: Karnataka set to observe total Bandh

తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాహనాలు రోడ్ల మీదకు తీసురాకూడదని తాము పదేపదే విజ్ఞప్తి చేసినా నిర్లక్షం చెయ్యడం వలనే ఇలా జరిగిందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద బంద్ లో పాల్గోన్న వారు ఎక్కడైనా టీఎన్ నెంబర్ వాహనాలు కనపడుతాయా అని పదేపదే పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+