రూ.50 లక్షల లంచం: పట్టుబడ్డ నలుగురు కన్టమ్స్ అధికారులు
ముంబై: లంచం తీసుకొంటూ నలుగురు కస్టమ్స్ అధికారులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.50 లక్షలను లంచం తీసుకొంటూ నలుగురు కస్టమ్స్ అధికారులు సీబీఐకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్నారు.
ముడుపులు తీసుకుంటున్న డిప్యూటీ కమిషనర్లు ముఖేష్ మీనా, రాజీవ్ కుమార్ సింగ్, సుదర్శన్ మీనా, సందీప్ యాదవ్, సూపరింటెండెంట్ మనీష్ సింగ్ మరో వ్యక్తి నీలేష్ సింగ్‌లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చేందుకు కస్టమ్స్ అధికారులు రూ 50 లక్షల ముడుపులు అడిగారనే ఫిర్యాదుపై సీబీఐ ఈ దాడులు చేపట్టింది. తొలుత రూ 5 లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఓ ప్రైవేట్ వ్యక్తి పట్టుబడ్డారు. వారి ద్వారా మిగిలిన అధికారుల పాత్రనూ సీబీఐ పసిగట్టి వారినీ అదుపులోకి తీసుకుంది. నిందితుల కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు చేపట్టింది.
పథకం ప్రకారంగా సీబీఐ అధికారులు కస్టమ్స్ అధికారులు లంచం తీసుకొంటుండగా పట్టుకొన్నారు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు వలపన్ని కస్టమ్స్ అధికారులను అదుపులోకి తీసుకొన్నారు.












Click it and Unblock the Notifications