బ్యాంకింగ్ మోసాలపై సీబీఐ నజర్.. 12 రాష్ట్రాల్లో సోదాలు.. 14 కేసులు నమోదు..
బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 12 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు జరుపుతోంది. 18 నగరాల్లోని 50 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించిన బ్యాంకు మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది.

ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వల్సాద్, పూనే, పలానీ, గయ, గురుగ్రామ్, ఛండీఘడ్, భోపాల్, సూరత్, కోలార్ తదితర ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దాడుల అనంతరం రూ.640 కోట్ల నిధుల గోల్ మాల్‌కు సంబంధించి సీబీఐ వివిధ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, బ్యాంకు అధికారులపై 14 కేసులు నమోదు చేసింది. పలు ప్రాంతాల్లో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications