వ్యాపం కిల్లింగ్ స్కాం: మూడు ఎఫ్ఐఆర్‌లు
భోపాల్: మధ్యప్రదేశ్ లో సంచలంనం సృష్టించిన వ్యాపం కిల్లింగ్ స్కాం రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో సీబీఐ అధికారులు మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. వ్యాపం స్కాంలో అనేక మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్ లలో చేర్చారు.
మధ్యప్రదేశ్ లో 2010 నాటి ఫ్రీ- మెడికల్ టెస్ట్ అక్రమాలకు సంబంధించి ఆ రాష్ట్ర వెనుకబడిన తరగతులు, మైనార్టీ కమిషన్ సభ్యుడు గులాబ్ సింగ్ కిరార్, ఆయన కుమారుడితో సహా 21 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
అదే విధంగా 2011 నాటి ఫ్రీ- పీజీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించి మరో 8 మంది పేర్లను రెండవ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లలో వ్యాపమ్ మాజీ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుధీర్ భాదౌరియా, పంకజ్ త్రివేదీల పేర్లు ఉన్నాయి.

వ్యాపం స్కాం ప్రధాన నిందితుడు సుధీర్ శర్మ నుండి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సహ పలువురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు లబ్ధిపోందారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తు పలు ప్రతాలను విడుదల చేశారు. సుధీర్ శర్మ గనుల వ్యాపారి.
సుధీర్ శర్మ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు పలువురికి ప్రయాణ ఖర్చలు అతనే సమకూర్చాడని వెలుగు చూసిందని అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications