పంచాయితీ ఉద్యోగినిపై రేప్ కి యత్నించిన సర్పంచ్..
బెంగళూరు : ప్రజా సంక్షేమం పట్ల బాధ్యాతాయుతంగా మెలగాల్సిన ఓ ప్రజా ప్రతినిథి దుర్మార్గంగా వ్యవహరించాడు. గ్రామ ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి పంచాయితీ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగినిపై కన్నేసి అత్యాచారానికి యత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో పరిధిలో ఉన్న ఓ గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగినిపై అత్యాచారయత్నం చేశాడు గ్రామ సర్పంచ్. సర్పంచ్ అత్యాచార యత్నం మొత్తం సీసీటీవీలో రికార్డవడంతో గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అక్కడి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. ఆరేళ్లుగా పంచాయతీ కార్యాలయంలో గ్రూప్-డీ హోదాలో ఉద్యోగినిగా పనిచేస్తున్న మహిళ మీద గ్రామ సర్పంచ్ చంద్రహాస్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కాగా సర్పంచ్ ని గట్టిగా ప్రతిఘటించిన ఉద్యోగిని అతడి చెర నుంచి తప్పించుకుని బయటపడింది.
గురువారం పంఛాయితీ కార్యాలయంలో విధులు ముగించుకున్న తర్వాత సాయంత్రం ఆరుగంటల సమయంలో అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు సర్పంచ్. కార్యాలయంలోని మిగతా ఉద్యోగులు సీసీటీవీ కెమేరాని పుటేజీని పరిశీలించి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా బాధితురాలు కెస్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పంచాయతీ కార్యాలయ సిబ్బంది సర్పంచ్ ని చితకబాది పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications