ఎగ్జిట్ పోల్స్ ను తప్పుబట్టిన ఈసీ- నచ్చని ఫలితాలొస్తే ఈవీఎంలపై విమర్శలా..?

తాజాగా హర్యానా, జమ్మూ-కాశ్మీర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎంల పనితీరుతో పాటు ఎగ్జిట్ పోల్స్ పైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హర్యానాలో పలుచోట్ల ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. రెండు రాష్ట్రాలపై ఇచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. దీంతో ఈ రెండు అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ స్పందించారు.

ఎగ్జిట్ పోల్స్‌ వైఫల్యంపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని ఆయన తేల్చిచెప్పేశారు. ఎగ్జిట్‌పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమే అన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్నికల సంఘం ప్రమేయం ఉండదన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటనలో స్వీయనియంత్రణ అవసరమని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమన్నారు.

cec Rajeev kumar key comments on exit poll predictions and evm tampering allegations

మరోవైపు ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ విపక్ష కాంగ్రెస్ పై సీఈసీ మండిపడ్డారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని ఆయన తెలిపారు. 6 నెలల ముందే ఈవీఎంలను పరిశీలిస్తామని, పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే వాటిని ఉపయోగిస్తామని వెల్లడించారు. పోలింగ్‌కు 5రోజుల ముందే బ్యాటరీలు అమరుస్తామని, మూడెంచల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయని సీఈసీ గుర్తుచేశారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారన్నారు. అలాగే ఈవీఎంలో బ్యాటరీలు ఒకేసారి ఉపయోగిస్తామని సీఈసీ క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+