రైతుల కోసం కేంద్రం శుభవార్త; రైతుల మేలు కోసం ఐదురోజుల పాటు ఆ కార్యక్రమం!!
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయానికి సంబంధించి రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం నేటి నుండి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది.

‘కిసాన్ భగీదారీ, ప్రాథమిక హమారీ' ప్రచారం
వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నేటి నుంచి 'కిసాన్ భగీదారీ, ప్రాథమిక హమారీ' ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 30 వరకు కొనసాగనున్న ప్రచారాన్ని వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి మేళాను మరియు సహజ వ్యవసాయంపై క్షేత్ర ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఉమ్మడి సేవా కేంద్రం (సిఎస్‌సి) నిర్వహించిన పంటల బీమాపై దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించనున్నారు.

వ్యవసాయ అభివృద్ధి మైలు రాళ్ళు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి హైలెట్
ఎంపిక చేసిన 75 మంది రైతులు మరియు పారిశ్రామికవేత్తలతో జాతీయ ఆత్మ నిర్భర్ భారత్ కాన్క్లేవ్ ప్రచారంలో ఉంటుంది. హరిత విప్లవంతో సహా 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యంలో వ్యవసాయ అభివృద్ధి మైలురాళ్ళు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ప్రచారంలో హైలైట్ చేయబడుతుంది. కిసాన్ భగీదారీ, ప్రాథమిక హమారీ' ప్రచారంలో కోటి మందికి పైగా రైతులు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల వారు పాల్గొంటారని అంచనా.

దేశవ్యాప్తంగా 720 కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన రైతుల భాగస్వామ్యం
వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా 720 కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన రైతులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి డెయిరీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కూడా సహకరిస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఐదు రోజుల పాటు జరగనున్న ప్రచారంలో చర్చనీయ అంశాలు ఇవే
ఐదు రోజులపాటు జరుగుతున్న ఈ ప్రచారంలో వ్యవసాయ సంబంధిత అనేక అంశాలపై, హరిత విప్లవం ఆహార ఉత్పత్తిలో స్వావలంబన, ఉద్యానవన పంటల సాగు, వ్యవసాయంలో సాంకేతికత, రిమోట్ సెన్సింగ్, డ్రోన్స్, బయోటెక్నాలజీ, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమం, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ బెస్ట్ మేనేజ్మెంట్, వ్యవసాయ యాంత్రీకరణలో పురోగతి, నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం, విత్తనాలు ఎరువుల స్వయంసమృద్ధి తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications