వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే.!పార్లిమెంట్ లో రేవంత్ రెడ్డి వాయిదా తీర్మాణం.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ రైతుల వరి పంట పంచాయితీ పార్లమెంట్ కు చేరింది. వరి పంట వేసిన తెలంగాణ రైతాంగం పరిస్ధితి దారుణంగా తయారయ్యిందని, వారి కష్టాలను తెలుసుకుని సానుకూలంగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. అందుకోసం పార్లమెంట్ సమావేశాలను వేదికగా మార్చుకుని కేంద్రానికి రైతుల సమస్యలు నివేదించాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ముందుగా ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున వరి కొనుగోలుపై ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో వాయిదా తీర్మాణం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

 ధాన్యం కొనుగోళ్ల పై లోక్ సభలో వాయిదా తీర్మానం

ధాన్యం కొనుగోళ్ల పై లోక్ సభలో వాయిదా తీర్మానం

తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్ చర్చ జరగాలని తెలంగాణ ఎంపీల బృందం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వాయిదా తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తెలంగాణ రైతుల సమస్యలు కూడా దేశ ప్రజల దృష్టికి తేవచ్చనేది కాంగ్రెస్ ఎంపీల వ్యూహంగా తెలుస్తోంది.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ పంటను కొనుగోలు చేయకపోడంతో అనేక సమస్యలు ఉత్వన్నమవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీలు వాదిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో పంటపొలాల్లో ఆరబెట్టిన పంట కుప్పలమీదే రైతుల ప్రాణాలు పోతున్నాయనే అంశాన్ని పార్లమెంటుకు వివరించాలనుకుంటున్నారు ఎంపీలు.

కేంద్రం మీద నెపం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం..

ఇంత జరగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్ర స్పందిండం లేదని, కేంద్రం మీద నెపం మోపి నిశ్శబ్దంగా కూర్చుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని కూడా పార్లమెంట్ లో ఎండగట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వరి ధాన్యం పండించొద్దని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెప్పలేదని, పండించిన తర్వాత కొనుగోలు చేయబోమని ప్రకటించిందని, ఎందుకు కొనుగోలు చేయరని రైతాంగం ప్రశ్నిస్తే కేంద్రాన్ని సాకుగా చూపిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. రైతులలో అయోమయం నెలకొందని దానికి కారణం కేంద్రమా? రాష్ట్రమా? తేల్చుకునేందుకు కూడా కాంగ్రెస్ ఎంపీలు ప్రణాళికలు రచిస్తున్నారు.

తెలంగాణ సీఎంను కలవకపోడానికి కారణాలేంటి..?

తెలంగాణ సీఎంను కలవకపోడానికి కారణాలేంటి..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం సేకరణ చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులు లక్షలాది టన్నుల వరి ధాన్యాన్ని కల్లాల్లోను, కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకుని రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారని, ఇలా కల్లాలోను, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి, మొలకెత్తుతోందని, దీంతో దిక్కుతోచని స్థితిలో మానసిక ఒత్తిడికి లోనై గుండె పోటులతో కొందరు, ఆత్మహత్యలకు ఒడిగట్టి కొందరు రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కాంగ్రెస్ పార్లమెంటుకు వివరించేందుకు సమాయత్తమవుతోంది.

పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదని, కనుక వరి కొనుగోలు అంశంపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.

రైతుల వేదన అర్దం చేసుకోండి..

రైతుల వేదన అర్దం చేసుకోండి..

ధాన్యం కొనుగోళ్ల పై లోక్ సభ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం అందించారు. తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యాన్ని సేకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.కేంద్ర మంత్రులతో చర్చల కోసం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చర్చలు జరిగాయా లేదా.? కేంద్ర వైఖరి ఎలా ఉంది.?కొనుచేస్తుందా లేదా.? కేంద్రం నించి వచ్చిన హామీ ఏంటి.? వంటి వివరాలను తెలంగాణ రైతాంగానికి చెప్పకుండా ఢిల్లీ నుండి నేరుగా ఫాం హౌస్ కు చంద్రశేఖర్ రావు వెళ్లి పోవడం రైతుల్లో మరింత అయోమయాన్ని పెంచిందని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇవే అంశాలను కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు కాంగ్రెస్ ఎంపీలు.

English summary
The Congress party is holding out for Parliament to discuss grain purchases. As part of this, the Telangana Congress party led by MP Revant Reddy gave an adjournment resolution on the purchase of paddy on the first day of the monsoon sessions of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X