వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాసేపట్లో కేంద్ర కేబినేట్ సమావేశం .. సర్వత్రా ఆసక్తి .. రీజన్ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

ఈరోజు ప్రధాని నివాసంలో 10 గంటల 30 నిమిషాలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. భారత్ చైనా సరిహద్దు లో పరిస్థితులు, కరోనా కట్టడి,లాక్ డౌన్ సడలింపులు ,దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై నేడు క్యాబినెట్ లో చర్చించనున్నట్లుగా సమాచారం.

చైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలుచైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకపక్క గాల్వాన్ వద్ద ఇరుదేశాల సైన్యం వెనక్కి తగ్గడం, జరుగుతున్న సైనిక శాంతి చర్చలు తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించిన కొన్ని ప్రకటనలు ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద కొన్ని ప్రకటనలు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, నేడు మరికొన్ని ప్రకటనలను కూడా ఆమోదించి త్వరితగతిన అమలు చేయనున్నట్లు గా తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ఆత్మనిర్భర్ ప్యాకేజీని అమలు చేయనున్నామని చెప్తున్న నేపథ్యంలో ఇందుకోసం క్యాబినెట్ నుంచి అనుమతి అవసరం ఉంది.

Central Cabinet meeting today at 10.30am.. is this the reason?

అయితే నేడు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ పై క్యాబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద స్వదేశీ ఉత్పత్తులను పెంచేలా వివిధ రంగాలకు నిధుల కేటాయింపు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా ఒకపక్క సరిహద్దులో చైనా భారత్ ఆందోళనలు, మరోపక్క దేశంలోని కరోనా పరిస్థితుల నేపథ్యంలో నేడు జరగనున్న క్యాబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. క్యాబినెట్ ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

English summary
The central cabinet is scheduled to meet at 10.30 am at the prime minister's residence today. Situations in the Indian-China border, corona restrictions, lockdown eases, the country's economic situation and measures to strengthen the economy and the athma nirbhar bharat package will be discussed in the Cabinet today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X