ఉద్యోగులకు కేంద్రం అద్దిరిపోయే ఆఫర్- మూలవేతనంలో 60% పెరుగుదల
దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు తీపికబురు అందింది. వారికి రెండుశాతం కరవు భత్యం లభించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి కిందటే వీటిపై ఆమోదముద్ర వేసింది. ఈ పెంపు వల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు అదనంగా రెండు శాతం డీఏ లభించబోతోంది.

ఈ ఉదయం 11:30 గంటల సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు లోక్ సభలో వీగిపోయిన మరుసటి రోజే కేంద్ర మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రులు చర్చించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు రెండు శాతం డీఏను పెంచడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేశారు.
ఈ నిర్ణయంతో ప్రస్తుతం అమలులో ఉన్న డీఏలో రెండు శాతం పాయింట్ల మేర పెంపు లభిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మందికి వర్తిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇచ్చే కరవుభత్యం. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది నెలవారీ వేతనాలు, పింఛన్లు పెరుగుతాయి. ఇది వారికి కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది.
తమ వేతనాలను సవరించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర కేబినెట్. ఈ అంశంపై నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NCJCM) ప్రభుత్వానికి ఓ వినతిపత్రాన్ని సైతం ఇటీవలే సమర్పించింది. అందులో 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించిందీ మెషినరీ. ఇది ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కంటే చాలా ఎక్కువ.
ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, కనీస మూల వేతనం 18,000 రూపాయల నుండి గణనీయంగా భారీగా పెరుగుతుంది. 69,000 రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇది మొత్తం వేతనంలో భారీ మార్పులకు దారితీస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఆదాయాన్ని సర్దుబాటు చేయడమే ఈ సంస్కరణల ఉద్దేశం. ఈ డిమాండ్లు ప్రతిపాదిత 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులతో ముడిపడి ఉన్నాయి.












Click it and Unblock the Notifications