వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం కీలక నిర్ణయం-బీఎస్ఎఫ్ అధికారాల పెంపు- మూడు రాష్ట్రాల్లో సరిహద్దుల్లోపలికి వచ్చేలా

|
Google Oneindia TeluguNews

సరిహద్దుల నుంచి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ పరిధిని విస్తరిస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అసోం, పశ్చిమబెంగాల్, పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాల్సిన బీఎస్ఎఫ్ బలగాల్ని దేశంలోకి కూడా వచ్చేందుకు అనుమతిస్తోంది.

అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుండి 50 కిలోమీటర్ల పరిధిలో "అరెస్ట్, తనిఖీలు, సీజ్ చేసేలా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారాలను సవరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్టోబర్ 11 న గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిపికేషన్ ప్రచురించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం విభాగాల్లో భాగమైన కేంద్ర సాయుధ పోలీసు దళం BSF అధికారాలు కొత్తగా సృష్టించిన కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు కూడా వర్తిస్తాయి.

central government enhance powers of border security force upto 50 kms

అంతకుముందు, BSF పరిమితి గుజరాత్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుండి 80 కిమీ, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలో 15 కిమీ వరకు నిర్ణయించారు. అక్టోబర్ 11న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం బిఎస్ఎఫ్ చట్టం 1968 లో సవరణలు చేశారు. ఇది మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ మరియు మేఘాలయ రాష్ట్రాల్లోనూ వర్తించేలా ఉంది.

2019 ఆగస్టులో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం 2014 ఆర్డర్‌లో పేర్కొనకపోయినా 1973లో చేసిన సవరణలో మాత్రం దాని గురించిన ప్రస్తావన ఉంది. అక్టోబర్ 11 ఉత్తర్వులో రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఇతర నిషేధిత వస్తువులు, విదేశీయుల అక్రమ ప్రవేశం మరియు ఇతర సెంట్రల్ యాక్ట్ కింద శిక్షార్హమైన నేరాలు వంటివి బిఎస్ఎఫ్ శోధన, స్వాధీనం చేసుకునే ఉల్లంఘనలుగా పరిగణించబోతున్నారు.
వాస్తవానికి ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ పరిధి కలిగిన ప్రాంతంలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాక లేదా సరుకును స్వాధీనం చేసుకున్న తర్వాత, BSF "ప్రాథమిక విచారణ" మాత్రమే చేసేందుకు అవకాశం ఉంది. అనుమానితుడిని 24 గంటల్లోపు స్థానిక పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. . నేర అనుమానితులను విచారించే అధికారం కూడా BSF కి లేదు.
దీన్ని కేంద్రం సవరించింది.

కేంద్రం తీసుకున్న చర్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ చన్నీ తీవ్రంగా స్పందించారు. కేంద్రం చర్యలు సమాఖ్య విధానం దాడిగా ఆయన అభివర్ణించారు. "అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉన్న 50 కిలోమీటర్ల బెల్ట్ లోపల BSF కి అదనపు అధికారాలు ఇవ్వాలనే కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చన్నీ తెలిపారు. ఇది సమాఖ్యవాదంపై ప్రత్యక్ష దాడి. ఈ అహేతుక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరుతున్నాను, "అని ఆయన ట్వీట్ చేశారు.

2012 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఇదే అంశంపై లేఖ రాశారు, బిఎస్ఎఫ్ చట్టం, 1968 ని సవరించడానికి కేంద్రం ప్రతిపాదించిన చర్యను వ్యతిరేకిస్తూ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు విస్తృత అధికారాలు ఇవ్వడానికి, ఏ ప్రాంతంలోనైనా ఎవరినైనా అరెస్ట్ చేయడానికి మరియు శోధించడానికి. అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు కేంద్రం అదే నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా కూడా ఈ నిర్ణయం "అశాస్త్రీయమైనది" అని పేర్కొన్నారు. సరిహద్దు లోపలి ప్రాంతాల్లో పోలీసింగ్ సరిహద్దు రక్షణ బలగాల కాదని అంతర్జాతీయ సరిహద్దును కాపాడే ప్రాథమిక విధిని నిర్వర్తించడంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సామర్థ్యాన్ని ఇది బలహీనపరుస్తుందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దులో BSF యొక్క అధికార పరిధిని పెంచమని కేంద్రాన్ని ఎన్నడూ అడగలేదని డిప్యూటీ సీఎం రాంధవా అన్నారు.

మరోవైపు కేంద్రం చర్యను శిరోమణి అకాలీదళ్ కూడా తప్పుబట్టిందతి. కేంద్రం చర్య దాదాపు సగం పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించినట్లేనని పేర్కొంది. ఇది వాస్తవంగా రాష్ట్రాన్ని వాస్తవమైన కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుందని మాజీ మంత్రి దల్బీత్ సింగ్ చీమా తెలిపారు. రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర పాలనలో ఉంచాలనే ఈ వంచక ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు.

English summary
the union government on today enhances powers to border security force in three states having international borders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X