Paytm FASTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? కేంద్రం డెడ్ లైన్..!

దేశవ్యాప్తంగా పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వినియోగదారులకు కేంద్రం ఇవాళ కీలక సూచన చేసింది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ NHAI అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న అందరు వినియోగదారులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం మార్చి 15ను తుది గడువుగా కూడా నిర్ణయించింది. దీంతో పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వారంతా పరుగులు తీస్తున్నారు.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇవాళ పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులకు కీలక సూచన జారీ చేసింది. ఇప్పటివరకూ పేటీఎం ప్లాట్ ఫామ్ పై ఫాస్టాగ్ కలిగిన వారంతా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ కు మారాలని కోరింది. జాతీయ రహదారులపై ప్రయాణాల్లో టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండాలంటే మార్చి 15 లోపు పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు ఇతర ప్లాట్ ఫామ్స్ కు మారిపోవాలని సూచించింది.

central government s key advice to Paytm FASTag users- this is the deadline

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వినియోగాదారులు ఇప్పటికే తమ ఫాస్టాగ్ బ్యాలెన్స్ లను మార్చి 15 తర్వాత వాడుకునే అవకాశం లేదు. అలాగే రీఛార్జ్ చేయడం కూడా కుదరదు. అయితే ప్రస్తుతం అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ లను మార్చి 15లోపు వాడుకునే అవకాశం మాత్రం కల్పించారు. దీనిపై ఇతర వివరాల కోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించాలని కేంద్రం కోరింది.

కేంద్రం ఇప్పటికే ఫాస్టాగ్ లను జారీ చేసే అధికారం కలిగిన బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల జాబితాను విడుదల చేసింది. ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లేదు. సవరించిన జాబితాలో ఇప్పుడు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ వంటి 39 సంస్థలు ఉన్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+