వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు Vs కేంద్ర ప్రభుత్వం?

|
Google Oneindia TeluguNews

న్యాయమూర్తుల నియామకం, బదిలీకి సంబంధించిన కొలీజయం వ్యవస్థ అనేది భారతదేశం రూపొందించిన చట్టం. దాన్ని ఎవరైనా సరే తప్పనిసరిగా పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతోంది. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.వేరే అభిప్రాయానికి కూడా తావులేదని తేల్చేసింది.

కొలీజియం వ్యవస్థకు సంబంధించి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి సుప్రీంకోర్టుతో బయటకు కనపడని వైరం నడుస్తోంది. ఇటీవలే న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సిఫార్సులను కేంద్రం ఆమోదించలేదు. కొలీజియం ఈ సిఫార్సులు చేసింది. అంతేకాకుండా ఉప రాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రి కొలీజియంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించాల్సి ఉంటుంది. కానీ వాటిని ఆమోదించకుండా కేంద్రం తాత్సారం చేస్తోందంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్లు దాఖలమయ్యాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కొలీజియం వ్యవస్థపై ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటివారిని నియంత్రించాలని ఆదేశాలు జారీచేసింది.

central government vs supreme court

కేంద్రం తిరిగి సూచించిన పేర్లనే రెండు సందర్భాల్లో కొలీజయం వెనక్కితీసుకుందని, దీనిప్రకారం సుప్రీంకోర్టుకే స్పష్టత లేదన్న అనుమానాలు తలెత్తతున్నాయని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. పునరుద్ఘాటించిన పేర్లను తప్పనిసరిగా ఆమోదించాలన్న ధర్మాసనం ఉత్తర్వులను విస్మరించే వీలు లేదంది. కేంద్రం కూడా ఇటీవల 19 పేర్లను తిప్పి పంపింది.

చట్టానికి సంబంధించి సుప్రీం న్యాయస్థానమే తుది నిర్ణేత అని, చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నా, అవన్నీ న్యాయస్థానాల్లో సమీక్షకు లోబడి ఉండాల్సిందేనని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు బయటకు కనపడని వైరం నడుస్తోందన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈ వైరం ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
The collegium system for the appointment and transfer of judges is a law enacted by India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X