బెంగాల్ దంగల్: ముకుల్ రాయ్‌కి భద్రత పెంపు, జెడ్ క్యాటగిరీగా అప్ గ్రేడ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఇటీవల దీదీ గాయపడ్డానని చెప్పడం.. నేతలు ఖండించడం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యనేతల భద్రతపై కేంద్రం ఫోకస్ చేసింది. బీజేపీ ముఖ్యనేత ముకుల్ రాయ్ భద్రతను పెంచింది. వై క్యాటగిరీ నుంచి జెడ్ క్యాటగిరీకి మార్చింది. ఎన్నికల వేళ ప్రొటెక్షన్ పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముకుల్ రాయ్ గతంలో టీఎంసీలో క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీలో చేరగా.. ఆ మధ్య బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు జేపీ నడ్డా.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత ముకుల్ రాయ్ వీఐపీ భద్రతను జెడ్ కేటగిరీకి మార్చారు. ఇవాళ అధికార వర్గాలు వివరాలు వెల్లడించాయి. ముకుల్ రాయ్‌కి ఇప్పటివరకు సీఆర్‌ఫీఎఫ్ సిబ్బందితో వై కేటగిరీ భద్రత కల్పించే వారు. ఇకపై ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా జెడ్ కేటగిరీ భద్రత కొనసాగనుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌లోని వీఐపీ విభాగానికి ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముకుల్ రాయ్... బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. 2017 నవంబర్‌లో ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. గతంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. మమత బెనర్జీతో పొసగక పార్టీ వీడారు. ఆ మధ్య దీదీతో సంప్రదింపులు జరిపారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవీ కార్యరూపం దాల్చలేవు. ఆ వెంటనే నడ్డా రంగంలోకి దిగడం.. ప్రాధాన్యం ఇవ్వడం జరిగిపోయింది. దీంతో రాయ్ బీజేపీలో ఇంపార్టెన్స్ పెరగడంతో కంటిన్యూ అవుతున్నారు.












Click it and Unblock the Notifications