Nisith Pramanik : కోర్టులో లొంగిపోయిన కేంద్ర మంత్రి ! దొంగతనం కేసులో..
పశ్చిమబెంగాల్ లోని అలీపుర్దువార్ లో 2009లో జరిగిన ఓ నగల షాపు దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిసిత్ ప్రామాణిక్ ఇవాళ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో ఆయన స్ధానిక కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆయన కోర్టు ఆదేశాలతో ఇంటికెళ్లిపోయారు.
2009లో అలీపుర్దువార్ లో రెండు నగల షాపుల దొంగతనం జరిగింది. ఇందులో నిసిత్ ప్రామాణిక్ పాత్రపై పోలీసులు నిర్దిష్ట ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనపై కేసు నమోదుచేశారు. గతేడాది నవంబర్ లో అలీపుర్‌దూర్ జిల్లా మూడో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బెయిల్ కోరుతూ ప్రామాణిక్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. కానీ కలకత్తా హైకోర్టు కూడా ఆయన్ను ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ కోల్ కతాకు వెళ్లి జిల్లా కోర్టులో లొంగిపోయారు.

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో లొంగిపోయిన నిసిత్ ప్రామాణిక్.. . దాదాపు 45 నిమిషాల పాటు కోర్టులోనే ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఓసారి భౌతికంగా హాజరైన తర్వాత తదుపరి విచారణలో ఆయన తరఫు న్యాయవాది హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రామాణిక్.. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలపై బెంగాల్ లోని మమతా బెనర్జీ సర్కార్.. తప్పుడు కేసులు మోపుతోందన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమేన్నారు.












Click it and Unblock the Notifications