బెంగాల్ ఐపీఎస్‌లపై ప్రతిష్టంభన- తక్షణం పంపాలన్న కేంద్రం- కుదరదన్న మమత
కోల్‌కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి వ్యవహారంలో బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్‌కు కేంద్రం పట్టుబడుతోంది. నడ్డా కాన్వాయ్ దాడికి బాధ్యులైన ముగ్గురు ఐపీఎస్ అధికారులను తక్షణం కేంద్ర డిప్యుటేషన్‌కు పంపాల్సిందేనని హోంశాఖ మరోసారి బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారును కోరింది. అయితే సీఎం మమత అందుకు నిరాకరించారు.
GoI’s order of central deputation for the 3 serving IPS officers of West Bengal despite the State’s objection is a colourable exercise of power and blatant misuse of emergency provision of IPS Cadre Rule 1954. (1/3)
— Mamata Banerjee (@MamataOfficial) December 17, 2020
బెంగాల్లో జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడికి బాధ్యులైన ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రవీణ్ త్రిపాఠీ, భోలానాథ్ పాండే, రాజీవ్ మిశ్రాలను వెంటనే రిలీవ్ చేసి పంపాలని మమతా బెనర్డీ సర్కారును హోంశాఖ మరోమారు కోరింది. వీరిలో బోలానాథ్‌ను బీపీఆర్‌డీ ఎస్పీగానూ, ప్రవీణ్ త్రిపాఠీని ఎస్‌ఎస్‌బీ డీఐజీగానూ, రాజీవ్ మిశ్రాను ఐటీబీపీ ఐజీగానూ నియమిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. నడ్డా కాన్వాయ్ ఘటనలో ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో వీరు ముగ్గురూ ఉన్నారు. దీంతో వీరిని డిప్యుటేషన్‌కు పంపాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే కేంద్రం ఆదేశాలను మమత తీవ్రంగా తప్పుబట్టారు. ఇది 1954 నాటి ఐపీఎస్ క్యాడర్ రూల్స్‌కు విరుద్ధమని మమత తెలిపారు. కేంద్రం ఐపీఎస్‌ల చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అంగీకార యోగ్యం కాదని, రాష్ట్రం విధుల్లో జోక్యం చేసుకోవడమేనని మమత ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను బయటి శక్తులు నడిపించే అవకాశం ఇవ్వబోమన్నారు. తద్వారా కేంద్రం కోరిన విధంగా ఐపీఎస్ అధికారులను పంపడం కుదరని మరోమారు తేల్చిచెప్పారు. దీంతో కేంద్రం ఏం చర్య తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This act is nothing but a deliberate attempt to encroach upon State’s jurisdiction & demoralize the serving officers in WB. This move, particularly before the elections is against the basic tenets of the federal structure. It's unconstitutional & completely unacceptable! (2/3)
— Mamata Banerjee (@MamataOfficial) December 17, 2020












Click it and Unblock the Notifications