35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం: వాటి నుంచి రెచ్చగొట్టే సందేశాలు

అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. అయితే విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.

అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.

 Centre bans 35 WhatsApp groups for spreading fake news

అగ్నిపథ్ పథకం నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. సికింద్రాబాద్‌లో ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ముందస్తు వ్యూహంలో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు జరిగాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి? ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని నేతలు అంటున్నారు. పోలీసుల దర్యాఫ్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడమీ సహకారంతో విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లో కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+