జగన్ తో పాటు ఆ పెద్దాయన రివర్స్ అయితే తప్ప ! కేంద్రానికి నల్లేరుపై నడకే..
ఏపీలో వైసీపీతో కేంద్రం నాలుగేళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అలాగే వైసీపీ కూడా కేంద్రానికి ప్రతీ విషయంలోనూ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా పార్లమెంటులో ప్రతీ బిల్లు విషయంలోనూ వైసీపీ అడక్కుండానే మద్దతిచ్చే పరిస్దితి ఉంది. వైసీపీ తరహాలోనే ఒడిశాలో అధికార బీజేడీ సైతం కేంద్రానికి అలాగే మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి మరోసారి వీరిద్దరి మద్దతు అవసరం కాబోతోంది. అయితే ఈసారి ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ మనసు మార్చుకుంటే కేంద్రానికి చుక్కలు తప్పవు.
దేశ రాజధాని ఢిల్లీలో సేవలపై ఎవరి పెత్తనం ఉండాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం చెప్పుచేతల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య కొన్నేళ్లుగా వార్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నా పరిస్దితిలో ఎలాంటి మార్పు లేదు. ఓసారి కేంద్రం, మరోసారి ఆప్ సర్కార్ ఈ విషయంలో పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీలో సేవలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికే పెత్తనం ఉంటుందని తేల్చిచెప్పేసింది. దీంతో కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని పక్కనపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే దీన్ని ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి నెగ్గించుకోవాల్సిన పరిస్దితి.

ఈ తరుణంలో పార్లమెంటులో సంఖ్యాబలం దృష్ట్యా చూస్తే కాంగ్రెస్ పార్టీ అండ లేకుంటే విపక్షాలు మొత్తం మద్దతిచ్చినా ఆప్ గట్టెక్కడం కష్టమేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్దితుల్లో కాంగ్రెస్ మద్దతిచ్చినా సరే ఈ బిల్లును ఆప్ గట్టెక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం భారీ సంఖ్యలో ఎంపీలున్న వైసీపీ, బీజేడీలే. ఈ రెండు పార్టీలు బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సేవల బిల్లును కేంద్రం నెగ్గించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. అలాగే ఏపీలోనూ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత ఒడిశాలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏపీ, ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ, బీజేడీ రెండు పార్టీలు ఈసారి బీజేపీకి గతంలోలో అండగా ఉంటాయా లేక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రివర్స్ అవుతాయా అన్న చర్చ సాగుతోంది. అయితే తాజా పరిస్దితి చూస్తుంటే ఈ రెండు పార్టీలు రివర్స్ కావడం కష్టమే. దీంతో ఆప్ కు కాంగ్రెస్ మద్దతిచ్చినా వైసీపీ, బీజేడీ రివర్స్ అయితే తప్ప ఢిల్లీ బిల్లును కేంద్రం గట్టెక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications