Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీలక నిర్ణయం: జమ్ము కాశ్మీర్‌లో జమాత్ ఏ ఇస్లామిని నిషేధించిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్‌లోని జమాత్ ఏ ఇస్లాంను (జేఈఐ) నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటంతో పాటు జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తుందనే ఆరోపణలతో నిషేధించింది.

ఇటీవల జమాత్ ఏ ఇస్లాంకు చెందిన దాదాపు 150 మందిని భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, దేశానికి నష్టం చేసేలా విధ్వంస కార్యకలాపాలలో పాల్గొంటుందని కేంద్రం అభిప్రాయపడింది.

Centre declares Jamaat e Islami in J&K as an unlawful association

ఇలాంటి సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిన పరిణామాలను కూడా వివరించింది. ప్రజాస్వామ్యం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, తద్వారా భారతదేశంలోని భూభాగాన్ని విడదీసేలా కుట్రలు చేస్తున్నాయని, అందుకే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

కాగా, భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతపై ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం గురువారం జరిగింది. లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్‌, సుష్మా స్వరాజ్‌, అరుణ్ జైట్లీతో పాటు త్రివిధ దళాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+