వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గుతున్న కరోనా సంక్రమణ వేగం- దేశంలో సానుకూల ఛాయలు- సడలింపుల కారణమిదే...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగం గతంలో కంటే భారీగా తగ్గింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు కూడా అప్పటికే వ్యాప్తించిన వైరస్ కారణంగానే అని ప్రభుత్వం అంచనావేస్తోంది. దీంతో ప్రధాని మోడీ ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభణ, 12 మందికి వైరస్, సిరిసిల్లలో ముగ్గురికి..జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభణ, 12 మందికి వైరస్, సిరిసిల్లలో ముగ్గురికి..

 కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం...

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గతంలో దాదాపు 10 శాతం వరకూ వెళ్లినా తాజాగా అది ఐదు శాతంలోపే నమోదవుతోంది. ఓ దశలో కరోనా వ్యాప్తి భారీగా ఉండటం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేసినా ఆ పరిస్దితి లేదని కేంద్రం విడుదల చేస్తున్న తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి కేవలం 5 శాతానికే పరిమితమవుతుండటం కేంద్రానికి ఊరట నిస్తోంది. అయితే ఇప్పటికే నమోదైన కేసులు, ఇప్పటికే వ్యాపించిన వైరస్ కారణంగా కేసుల సంఖ్య గరిష్టానికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

 జూన్ 17 నాటికి 5 లక్షల కేసులు..

జూన్ 17 నాటికి 5 లక్షల కేసులు..

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇతర పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుంటే జూన్ 17 నాటికి ఐదు లక్షల కేసులు నమోదు కావచ్చని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోగా.. మరో 20 రోజుల్లోనే మూడున్నర లక్షల కేసులు నమోదు కావచ్చని తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో పాటు ఇతరత్రా అంశాలే ఇందుకు కారణం.

దీంతో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.

Recommended Video

India-China Face Off And Locusts Swarms, A Big Challenges For India
 వ్యాప్తి తగ్గడంతో కేంద్రం సడలింపులు...

వ్యాప్తి తగ్గడంతో కేంద్రం సడలింపులు...

దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ వేగం తగ్గుతోందన్న వార్తలతో కేంద్రం కూడా మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వైరస్ సంక్రమణ వేగం తగ్గితే కేసుల సంఖ్య కూడా గరిష్టానికి వెళ్లాక తిరిగి తగ్గుముఖం పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. దీంతో జూన్ 1 నుంచి ప్రార్ధనాస్ధలాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. వీటితో పాటు మరికొన్ని వ్యాపార సంస్ధలు, దుకాణాలు తెరవనున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ 5.0 మాత్రం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

English summary
central govt has been planning to ease lockdown measures as coronavirus spreading speed in the country decreases than earlier. after latest observations, centre plans to give more relaxations in lockdown from june 1st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X