
కరోనా ఆంక్షలు: ఆగస్టు 31కి పొడగింపు -కేసులు తగ్గలేదని మరువొద్దు -రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ఉధృతి తగ్గిందనే భ్రమలో అన్ని రాష్ట్రాలూ వరసు పెట్టి ఆంక్షలు ఎత్తేశాయి. ప్రస్తుతం దాదాపు అన్ని చోట్లా కొవిడ్ ప్రోటోకాల్స్ గట్టెక్కిన పరిస్థితి. ఈ దశలో కరోనా మూడో వేవ్ తలెత్తొచ్చన్న నిపుణుల హెచ్చరికలు, నిజంగానే పలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు పెరుగుదల సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
జగన్
వేడుకున్నా
వినని
ప్రధాని
మోదీ
-మరో
లేఖాస్త్రం
-ఏపీలో
3వ
వేవ్
భయాలు
-కరోనాపై
సీఎం
కీలక
ఆదేశాలు
భారత్ లో కరోనా ఆంక్షలు లేదా నియమ నిబంధనల కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఆగస్టు 31 వరకూ 'కరోనా గైడ్‌లైన్స్' అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని హోంశాఖ సూచించింది.

కేసులు తగ్గాయనే నిర్లక్ష్యం వద్దని, ఓవరాల్ గా కేసులు పూర్తిగా తగ్గలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పండగలు రాబోతున్నాయని, ప్రజల రద్దీని నియంత్రిస్తూ, నియమాలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది. అటు కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసింది..
మనందరి
ఫోన్లలో
మోదీ
ఆయుధం
-పెగాసస్
నిఘా
కుట్రపై
రాహుల్
సంచలనం
-కేంద్రంపై
14
పార్టీల
పోరు
కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా సమసిపోలేదని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని, పండగల సీజన్ కంటే ముందే భారీ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ నొక్కిచెప్పింది. బుధవారం నాడు కొత్తగా 43,654 కేసులు, 640 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,99,439 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా 44,61,56,659డోసుల టీకాలు పంపిణీ అయ్యాయి.