మోడీ సర్కారు శుభవార్త: మరో ఆరు నెలలపాటు పీఎంజీకేఏవై పథకం పొడిగింపు, 80 కోట్ల మందికి లబ్ధి

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రవేశపెట్టింది.

నిర్ణీత కాల వ్యవధితో ప్రవేశపెట్టిన ఈ పథకం గడువు ఇప్పటికే ఒకసారి ముగియగా.. పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ పథకం గడువును పొడిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

 Centre Extends PMGKAY Scheme Till September 2022

'దేశంలోని ప్రజల శక్తిని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు అంటే సెప్టెంబర్‌ 2022 పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు' అని ట్వీట్‌లో ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కాగా, ఈ పథకాన్ని కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 2020 నుంచి ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీని కింద అర్హులైన సుమారు 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తోంది. తాజాగా, మార్చి నెలాఖరుతో ఈ పథకం గడువు ముగియనుండటంతో.. కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై చర్చించారు. ఈ పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించారు. దీంతో ప్రజలకు మరో ఆరు నెలలపాటు ఉచిత రేషన్ లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+