పెట్రోల్, డీజిల్ పై పెరిగిన ఎక్సైజ్ ట్యాక్స్... ! ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..!
కేంద్రం మరోసారి పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు చేసింది. డీజిల్ ధరల్ని సవరించాలని ఇవాళ నిర్ణయించింది. గతేడాది వరుస ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల మార్పుల్ని పక్కన పెట్టేసిన కేంద్రం.. ఇప్పుడు హఠాత్తుగా వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఈ అర్ధరాత్రి నుంచే కొత్త ధరల్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో ప్రధాన నగరాల్లో వాహనదారులు పెట్రోల్ బంక్ లకు క్యూ కడుతున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో ఇలా లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. ఇప్పటికే రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలోకి తీసుకురాకుండా పాత వ్యాట్ రేట్లను అమలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో మరో రెండు రూపాయల్ని పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రం నిర్ణయంతో పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయలకు చేరుకుంది. అలాగే డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ కాస్తా 10 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయి. అయినా ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎందుకన్న చర్చ జరుగుతోంది. అయితే రిటైల్ ధరలపై దీని ప్రభావం ఉండబోదని కేంద్రం తెలిపింది.

మరోవైపు పెట్రో ధరల పెంపుపై కేంద్రం వెంటనే క్లారిటీ ఇచ్చింది. ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. పెరిగిన 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని వెల్లడించింది. కాబట్టి పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది.












Click it and Unblock the Notifications