మే 17 తర్వాత దేశీయ విమాన సర్వీసులు ? గ్రీన్ జోన్ల మధ్యే రాకపోకలకు అనుమతి..
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సర్వీసుల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఓ సమగ్ర ప్రణాళికను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విమానయాన సంస్ధలతో చర్చలు జరుపుతున్న కేంద్రం... మే 17 తర్వాత దేశీయ సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video

మే 17 తర్వాత దేశీయ విమాన సర్వీసులు...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ గడువు మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధిరించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాక్ డౌన్ ముగియగానే దేశీయ సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ప్రైవేటు ఆపరేటర్లతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

గ్రీన్ జోన్ నగరాల మధ్యే రాకపోకలు..
కేంద్రం ఒకవేళ దేశీయంగా విమాన సర్వీసులు పునరుద్దరించినా అవి గ్రీన్ జోన్లకే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓ గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ నగరం మధ్యే విమాన సర్వీసులు నడుస్తాయి. అదీ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాకే వీటిని అనుమతిస్తారు. విమానాశ్రయాల్లోనూ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న నగరాల్లో సర్వీసుల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

రాజీ ప్రసక్తే లేదంటున్న కేంద్రం...
ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించింది. 64 ప్రత్యేక విమానాల్లో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నాు. అదే క్రమంలో దేశీయ సర్వీసులను కూడా పలు జాగ్రత్తలు తీసుకుని నడిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను అనుగుణంగానే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందని కేంద్రం చెబుతోంది. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడటం ద్వారా విమానయాన సర్వీసులను నడిపే ఆలోచన లేదని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ తెలిపారు.












Click it and Unblock the Notifications