ఆలం విడుదల: సభ్యుల ఆందోళన, కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదన్న మోడీ
న్యూఢిల్లీ: వేర్పాటువాదులు, ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నేత మసరాత్ ఆలంను విడుదల చేయడంపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఆలం విడుదల విషయంలో లోక్ సభలో విపక్షాలు ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు.

మసరాత్ ఆలం విడుదలపై కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వాములమైన కూడా సమాచారం లేదన్నారు. దేశ ప్రజలకు భద్రతపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు.
ఉగ్రవాదల దుశ్చర్య కారణంగా మా నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని బలి తీసుకున్న విషయాన్ని గర్తు చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించబోనని ఆయన పేర్కొన్నారు. మసరాత్ ఆలం విడుదలపై ప్రజల్లో వ్యక్తమైన భావాలు, పార్లమెంట్ సభ్యుల ఆందోళనలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.
ప్రధాని సమాధానంతో సంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో ఆందోళనను కొనసాగించారు. విపక్షాల ఆందోలన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసారత్ ఆలం విడుదలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications