జమ్మూ కాశ్మీర్‌లో గవర్నర్ పాలన... కేంద్రం సిఫారసు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్ధితుల వల్ల గవర్నర్ పాలన అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా అయిష్టత వ్యక్తం చేయడంతో గవర్నర్ పాలనకు కేంద్రం సిఫారసు చేసింది. మరో పది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు ముగియబోతోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వెలువడిన తాజా ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని విషయం తెలిసిందే. ఒకవైపు బీజేపీ నేతలు, మరోవైపు పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ) నేతలు వరుసగా గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

Centre recommends Governor's rule in Jammu and Kashmir

ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలు ముందుకు రాకపోవడంతో గవర్నర్ వోహ్రా రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభనకు స్వస్తి పలికాలని ఇటీవలే కేంద్రానికి ఓ నివేదిక పంపినట్టు సమాచారం. ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ (44) స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అవసరాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు అవసరమని జమ్మూ కాశ్మీర్ అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. "రాష్ట్రానికి ఇచ్చే రూ. 44 వేల కోట్ల వరద సాయాన్ని పొందడానికి బీజేపీతో పొత్తు అవరసరమని జమ్మూ కాశ్మీర్ పీడీపీకి చెప్పాం" అని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+