కరోనా వ్యాక్సిన్‌పై సీరం, భారత్ బయోటెక్‌కు షాక్- అనుమతి నిరాకరించిన కేంద్రం
భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుందని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం ఇవాళ నిరాశ కలిగించే వార్త చెప్పింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్ధలు దేశంలో అత్యవసర పరిస్ధితుల్లో తమ వ్యాక్సిన్ వాడకానికి అనుమతి ఇవ్వాలని చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఆయా సంస్ధలు తమ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని కోరింది.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ తమ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అత్యవసర పరిస్ధితుల్లో దేశీయంగా వాడేందుకు అనుమతి ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాను కోరింది. ఆ తర్వాత పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్ధలతో కలిసి తాము తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ రెండు విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రం.. ప్రస్తుతం వీటిని పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని ఆయా సంస్దలకు సూచించింది.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా సంస్దకు వ్యాక్సిన్ తయారీకి అనుమతి ఇవ్వాలంటే రిస్క్ బెనిఫిట్ రేషియో ప్రకారం డ్రగ్ కంట్రోలర్ సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీరంతో పాటు భారత్ బయోటెక్ సంస్ధలు సమర్ఫించిన డేటా ఈ ప్రమాణాల ప్రకారం లేదని భావించడం వల్లే వీరి వినతులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మూడు వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జయంతి సందర్భంగా కేంద్రం దీన్ని అందుబాటులోకి తెస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ డ్రగ్ కంట్రోలర్ హెచ్చరికలతో కేంద్రం కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications