Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కశ్మీర్లోకి పండిట్ల రీ ఎంట్రీ చిచ్చు- ఉగ్రదాడులు, స్ధానిక వ్యతిరేకత- కేంద్రానికి ఎదురుదెబ్బలు

కశ్మీర్లో రెండేళ్ల క్రితం కేంద్రం చేపట్టిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన నేపథ్యంలో అక్కడి నుంచి ఏళ్ల క్రితం పారిపోయిన పండిట్ల రీ ఎంట్రీకి చేపడుతున్న చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. పండిట్లను తిరిగి లోయలోకి రప్పించేందుకు కేంద్రం ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తున్నా, హామీలు ఇస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. తాజాగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడులతో పాటు రాజకీయ వ్యతిరేకతే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడి అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమై పలు సూచనలు చేస్తున్నారు.

 కశ్మీర్ పండిట్ల రీ ఎంట్రీ

కశ్మీర్ పండిట్ల రీ ఎంట్రీ

కశ్మీరీ పండిట్లు జమ్మూకశ్మీర్ ను వీడి దశాబ్లాలు గడిచిపోతున్నాయి. ఒకప్పుడు భారీ సంఖ్యలో ఇక్కడ ఉండే పండిట్లు ఆ తర్వాత పెరిగిన తీవ్రవాద దాడులు, ఇతరత్రా కారణాలతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసపోయి తలదాచుకుంటున్నారు. అయితే వీరిని తిరిగి లోయకు రప్పించేందుకు కేంద్రం తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్ధితులు తమ ఆధీనంలోకి వచ్చాయని భావిస్తున్న కేంద్రం పండిట్లను రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఆ ప్రాంతంలో తమ పట్టు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ఈ ప్రయత్నాలు ఫలించడం లేదు.

ఉగ్రవాద దాడులతో భయానక పరిస్ధితులు

ఉగ్రవాద దాడులతో భయానక పరిస్ధితులు

కశ్మీర్ లో ఏ ఉగ్రవాదాన్ని రూపుమాపుతామనే కారణంతో కేంద్రం.. ఆర్టికల్ 370 రద్దు చేసిందో ఆ కారణం ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదని తాజాగా అక్కడ పెరుగుతున్న ఉగ్రవాద దాడులు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ వలసకూలీల్ని టార్గెట్ చేసుకుని రెండు రోజుల వ్యవధిలో మూడు ఉగ్రవాద దాడులు జరగడంతో అక్కడికి వచ్చేందుకు ఇతర ప్రాంతాల వారు అస్సలు ఇష్టపడటం లేదు. ఉగ్రవాదులు తమను టార్గెట్ చేశారనే సమాచారంతో పండిట్లు సైతం కశ్మీర్ లోయకు వచ్చే ఆలోచనల్ని సైతం విరమించుకుంటున్నారు. కేంద్రం ఎన్ని హామీలు ఇస్తున్నా తాము తిరిగి వచ్చేందుకు సిద్ధపడటం లేదు.

రాజకీయ వ్యతిరేకత

రాజకీయ వ్యతిరేకత

కశ్మీర్లోకి దశాబ్దాల తర్వాత తిరిగి పండిట్లను రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అక్కడ రాజకీయ పార్టీల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కశ్మీర్లో పండిట్లు అడుగుపెట్టే పరిస్ధితులు లేవని తాజాగా మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రం దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసే ప్రయత్నాల్లో భాగంగానే బలవంతంగా పండిట్లను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. కశ్మీర్ కు చెందిన బీజేపీయేతర పార్టీలన్నింటిదీ అదే వైఖరి. దీంతో వీరిని కాదని పండిట్లను రప్పించేందుకు కేంద్రం ముందడుగు వేయలేకపోతోంది. అలాగని పండిట్లను రప్పించే విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

 సైన్యంపై కేంద్రం ఒత్తిడి

సైన్యంపై కేంద్రం ఒత్తిడి

కశ్మీర్ లోయలోకి పండిట్లను తిరిగి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముందుకు సాగకపోవడంపై కేంద్రం అసంతృప్తిగా ఉంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత తలెత్తిన పరిస్ధితుల్ని నియంత్రించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ మేరకు సైన్యంపైనా ఒత్తిడి పెంచుతోంది. కశ్మీర్ లో ఇంకా ఉగ్రవాద దాడులు ఎందుకు కొనసాగుతున్నాయని అధికారుల్ని ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ముఖ్యంగా సాధారణ పౌరుల్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పరిస్దితులు ఇంకా నియంత్రణలోకి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమిత్ షా.. ఆ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+