జగన్, కేసీఆర్ సహకరించట్లేదు-పార్లమెంటులో కేంద్రం ప్రకటన-జోక్యంపై యూటర్న్!
తెలుగు రాష్ట్రాల్ని కేంద్రం విభజించి ఎనిమిదేళ్లయింది. ఇప్పటికీ ఎక్కడ వివాదాలు అక్కడే ఉన్నాయి. వాటి పరిష్కారానికి కేంద్రం చొరవ చూపడం లేదని ఇరు తెలుగు రాష్ట్రాలు ఈ ఎనిమిదేళ్లుగా ఆరోపిస్తూనే ఉన్నాయి. అంతటితో ఆగకుండా కొత్త వివాదాల్ని సైతం తెరపైకి తెచ్చి కేంద్రం జోక్యం కోరుతున్నాయి. తీరా కేంద్రం జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం మొదలుపెట్టగానే మౌనంగా ఉండిపోతున్నాయి. మళ్లీ ఆ వివాదాలపై ఏం చేస్తున్నారంటూ పార్లమెంటులో ఈ రాష్ట్రాల ఎంపీలే ప్రశ్నలు వేస్తున్నాయి. దీంతో కేంద్రానికి చిర్రెత్తుకొస్తోంది.

తెలుగు రాష్ట్రాల జల వివాదాలు
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత చాలా వివాదాలు తలెత్తినా ఇందులో అతి ముఖ్యమైనది జల వివాదమే. విభజనకు ముందు నుంచే ఈ వివాదాలు వస్తాయని చాలా మంది చెప్పారు. అయినా విభజన అనివార్యం కావడంతో ఈ విషయం పక్కకుపోయింది. చివరికి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత క్రమంగా ఇవి మొదలయ్యాయి.
తొలుత కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టులు, వాడుకుంటున్న నీరు, తాగునీరు, సాగునీరు, మిగులుజలాలు అంటూ ఇరు రాష్ట్రాలు వివాదాల్ని పెంచుకుంటూ పోయాయి. చివరికి కేంద్రం జోక్యం కోరాయి.

జల వివాదాల్లో కేంద్రం జోక్యం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా ఉన్న కృష్ణానదీ ప్రాజెక్టులపై వివాదాలు తలెత్తడంతో కేంద్రం వాటిని తమ ఆధీనంలోకి తీసుకుని వివాదాలు పరిష్కరించాలని ఇరు రాష్ట్రాలూ కోరాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి అన్ని ప్రాజెక్టుల్ని తీసుకొచ్చి వాటి వివాదాలు పరిష్కరించాలని భావించింది.
అయితే ఈ ప్రతిపాదనకు తిరిగి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోకాలడ్డారు. తమ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమంటూ మెలికలు పెట్టడం మొదలుపెట్టాయి. దీంతో కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి.

జగన్, కేసీఆర్ సహాయనిరాకరణ
కృష్ణా నదీ ప్రాజెక్టులపై వివాదాల్ని పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరూ కోరారు. అయితే కేంద్రం రంగంలోకి దిగేసరికి ఇద్దరూ వెనక్కి తగ్గారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులపై కేంద్రం నిర్ణయాలకు సహకరించని వీరిద్దరూ.. ప్రాజెక్టుల అప్పగింతపైనా కిమ్మనడం లేదు. దీంతో కేంద్రం కూడా ముందుకెళ్లలేని పరిస్దితి తలెత్తుతోంది. అయితే పార్లమెంటులో మాత్రం వైసీపీ, టీడీపీ ఎంపీలు దీనిపై కేంద్రానికి ప్రశ్నలు వేస్తున్నాయి. తెలంగాణను అడ్డుకోవాలని కోరుతున్నాయి. దీంతో కేంద్రం నిన్నతీవ్రంగా స్పందించింది.

జగన్, కేసీఆర్ కు షెకావత్ షాక్
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి అప్పగించలేదని, అటువంటప్పుడు ఈ వివాదాలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు ఎలా ఇస్తుందంటూ నిన్న గజేంద్రసింగ్ షెకావత్ ప్రశ్నించారు. దీనికి ఎంపీల వద్ద సమాధానం లేదు. ప్రభుత్వాల వద్ద అంతకన్నా లేదు. కేవలం రాజకీయ ఆరోపణల కోసం, విమర్శల కోసం పొరుగు రాష్ట్రాల తీరుపై ప్రశ్నలు అడుగుతున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు ఇప్పుడు తమ ప్రభుత్వాలను కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఎందుకు అప్పగించలేదని అడిగే పరిస్ధితి ఉందా అంటే అదీ లేదు.
దీంతో ఈ వివాదాల్ని తెరపైకి తెచ్చిన ఇరు రాష్ట్రాలు ఇప్పుడు తామూ పరిష్కరించుకోలేక, కేంద్రానికీ అప్పగించలేక ఇరుకున పడుతున్నాయి.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications