వేర్పాటువాది విడుదల కలకలం, సంకీర్ణంలో బీటలు: పీడీపీపై బీజేపీ ఆగ్రహం
శ్రీనగర్/న్యూఢిల్లీ: కాశ్మీర్ వేర్పాటు నాయకుడు మసరాత్ ఆలం విడుదలతో జమ్మూ కాశ్మీర్‌లో ఏర్పడిన పీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం కొనసాగుతోంది. ఆలంక విడుదలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ఈ నిర్ణయం ఏకపక్షమని, తమను విశ్వాసంలోకి తీసుకోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడింది.
ఈ నిర్ణయం ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో భాగం కాదని పేర్కొంది. బీజేపీ వ్యాఖ్యల పైన పీడీపీ విభేదించింది. సీఎంపీకి లోబడే ఈ నిర్ణయం ఉందని పీడీపీ తెలిపింది.
ఆలమ్‌ను విడుదల చేయడం ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని బీజేపీ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు జుగల్ కిషోర్ అన్నారు. ఆలంను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు కనీసం తమ పార్టీని సంప్రదించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ అయిన జుగల్ కిశోర్ అన్నారు.
ఈ అంశంపై ఆదివారం రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు సమావేశమవుతుందని చెప్పారు. తమ పార్టీ పీడీపీకి నిరసనను తెలియజేస్తుందన్నారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించాలని కోరుతుందన్నారు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ నిర్ణయం తమ పార్టీని తీవ్రంగా బాధించిందన్నారు. ఆలం విడుదల చేసే ముందు సీఎం సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి అయిన తమ పార్టీని సంప్రదించలేదన్నారు.

దీనిపై పీడీపీ స్పందించింది. జమ్మూ, కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి ఈ సమస్యతో సంబంధం ఉన్న భాగస్వాములందరినీ విశ్వాసం తీసుకుంటామని కనీస ఉమ్మడి కార్యక్రమంలో స్పష్టంగా పేర్కొన్నామని, దానికి అనుగుణంగానే ఆలం విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకున్నామని పీడీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అక్తర్ అన్నారు.
రాష్ట్రంలో శాంతి, సమన్వయం కోసం రాష్ట్రంలోని ఈ సమస్యతో సంబంధం ఉన్న అందరినీ, సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న వారిని భాగస్వాములను చేస్తామనేది తమ కనీస ఉమ్మడి కార్యక్రమంలో ప్రధాన భాగమని, ఆ దృష్టితోనే ఆలం విడుదలను చూడాలన్నారు. వేర్పాటువాదులతో సహా భాగస్వాములందరితో చర్చలు జరపడం గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి బలమైన సాక్ష్యాధారాలు లేకుండా వారిని జైళ్లలోనే ఉంచి వారితో చర్చలు జరపడం సాధ్యం కాదన్నారు.
ఇదిలా ఉండగా ఆలం విడుదల పైన వివాదం నేపథ్యంలో... ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. ప్రధాని మోడీ దీనిపై తన వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ సమాచార విభాగం ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా అన్నారు. ఆలం విడుదలను నిరసిస్తూ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు జమ్ములో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే పాంథర్స్ పార్టీ రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది.
పీడీపీ మంత్రి అసంతృప్తి
మంత్రిత్వ శాఖల కేటాయింపుపై పీడీపీ ఎమ్మెల్యే, షియావర్గ నేత ఇమ్రాన్ రజా అన్సారీ అసంతృప్తి వెళ్లగక్కారు. పెద్దగా ప్రాధాన్యంలేని క్రీడలు-యువజన వ్యవహారాలు, ఐటీ శాఖ తనకు వద్దన్నారు. తాను సరేనన్నా, నియోజకవర్గ ప్రజలు ససేమిరా అంటున్నారన్నారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications