ఎన్నికల వేళ.. కేంద్రం గుడ్ న్యూస్..!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకాస్సేపట్లో లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమౌతాయి. ఇవి- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు.

Centre slashes the import duty on mobile phones components

మూడు నెలల కాలానికి మాత్రమే సరిపడేలా బడ్జెట్ కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తోన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అవసరమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి అవసరమైనంత మేర కేటాయింపులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మరోసారి సభ సమావేశమౌతుంది.

కాగా- ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ అమ్మకాలు, మొబైల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గేలా చర్యలు చేపట్టింది. సెల్ ఫోన్ల తయారీలో వినియోగించే విడి భాగాలు, ఇతర పరికరాలపై వసూలు చేస్తోన్న దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది.

మొబైల్ ఫోన్ల తయారీలో వినియోగించే విడి పరికరాల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 15 శాతం వరకు సుంకాన్ని వసూలు చేస్తోంది. దీన్ని 10 శాతానికి తగ్గించింది. స్క్రూ, సిమ్ సాకెట్, మెటల్‌తో కూడిన ఇతర మెకానికల్ విడి పరికరాలకు ఈ తగ్గింపును వర్తింపజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ విక్రమ్ విజయ్ వానెరే నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+