• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బలగాల మోహరింపు నుంచి బిల్లు పెట్టే దాకా.. అంతా పదకొండు రోజుల్లోనే పూర్తి చేసిన మోడీ, షా..

|

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ విభజన విషయంలో బీజేపీ పక్కా వ్యూహంతో వ్యవహరించింది. ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న నిర్ణయం అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేసింది. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మోడీ సర్కారు ఫిక్స్ చేసుకున్న టైం కేవలం 11 అంటే 11 రోజులు మాత్రమే. బలగాల మోహరింపు నుంచి బిల్లు సభలో పెట్టడం వరకు ఆగస్టు 5లోగా పూర్తి చేయాలని మోడీ, అమిత్ షా ద్వయం నిర్ణయించి వ్యూహాన్ని అమలు చేసింది.

లెక్క మారింది... దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు లెక్క మారింది... దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

వారం వ్యవధిలో 43వేల భద్రతా సిబ్బంది మోహరింపు

వారం వ్యవధిలో 43వేల భద్రతా సిబ్బంది మోహరింపు

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో అధికార ప్రకటన వెలువడే వరకు వారంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా వేచి చూశారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బట్టి ఊహించనిదేదో జరగబోతోందన్న విషయం మాత్రం అర్థమైందని అధికారులు అంటున్నారు. 1971లో జరిగిన యుద్ధం సమయంలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిర్ణయం అమలులో భాగంగా కేంద్రం తొలుత సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దిపింది. ఆదివారం సాయంత్రం నాటికి 430 కంపెనీల సీఆర్పీఎఫ్ ట్రూప్స్‌కు చెందిన 43వేల మంది పారామిలటరీ బలగాలు జమ్మూ కాశ్మీర్‌లో మోహరించాయి. వారిని తరలించేందుకు కేంద్రం ఇండియన్ ఆర్మీ సాయం తీసుకుంది. బలగాలను తరలించేందుకు ఎయిర్‌ఫోర్స్‌లో కొత్తగా చేరిన సీ - 17 గ్లోబ్ మాస్టర్ విమానాలు వారం రోజుల్లో 100కు పైగా చక్కర్లు కొట్టాయి.

మొబైల్ కోర్టుల ఏర్పాటు

మొబైల్ కోర్టుల ఏర్పాటు

శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొనటంతో కేసుల విచారణ కోసం అదనంగా జడ్జిలను నియమించారు. దాదాపు 60 మంది అడిషనల్ స్పెషన్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ల సేవలు తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ హింసాత్మక ఘటనలు తలెత్తితే అందుకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు మొబైల్ మెజిస్ట్రేట్లు ఏర్పాటు చేశారు. తద్వారా నిందితులను వెంటనే అరెస్ట్ చేసే అవకాశం లభించింది. అలా అరెస్టైన వారిని తరలించేందుకు శ్రీనగర్‌లో ఆరు తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఘర్షణలు తలెత్తితే పలువురు గాయపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు ప్రభుత్వ డాక్టర్ల సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు.

 మొబైల్ సేవలు నిలిపివేత

మొబైల్ సేవలు నిలిపివేత

సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించే అవకాశం ఉండటంతో ఆదివారం అర్థరాత్రి మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని నిలిపివేశారు. శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జామున 4గంటల నుంచి ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా పనిచేయడం మానేశాయి. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో భద్రతా సిబ్బంది కోసం భారీ సంఖ్యలో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో 10 రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆగస్టు 15 వరకు కట్టుదిట్టమైన భద్రత కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

English summary
Eleven days ago, the Home Ministry gave officials in Jammu and Kashmir a deadline August 5. By this date, they were required to flood the state with paramilitary forces to tackle any fallout of the government's decision to scrap Article 370 and spilt the state into two union territories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X