బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహీంద్రా షోరూమ్ లో సినిమా చూపించిన రైతు, గంటలో రూ. 10 లక్షలు క్యాష్, డెలవరీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/తుమకూరు: మహీంద్రా వాహనాలకు దేశంలో ఎంత డిమాండ్ ఉందో అనే విషయం అందరికి తెలిసిందే. మహీంద్రా స్కార్పియో కార్ల దగ్గర నుంచి బోలేరో వాహనాలు విపరీతంగా సేల్స్ అవుతున్నాయి. సిటీల్లో ఎక్కువగా రాజకీయ నాయకులు స్కార్పియో కార్లు వాడుతున్నారు. ఇక పట్టణాలు, గ్రామాల్లో ఉంటున్న రాజకీయ నాయకులు, రైతులు ఎక్కువగా బోలేరో వాహనాలు వాడుతున్న విషయం అందరికి తెలిసిందే. మహీంద్రా షోరూమ్ లోకి ఓ రైతు వెళ్లి తనకు బోలేరో పిక్ అప్ వాహనం కావాలని చెప్పాడు. మహీంద్రా షోరూమ్ లో ఉన్న సేల్స్ మెన్ ఆ రైతును చూసి ఓరి పిచ్చోడా బోలేరో పిక్ అప్ వాహనం ఖరీదు రూ. 10 లక్షలు, కనీసం నీ జోబులో రూ. 10 రూపాయలు అయినా ఉన్నాయా ?, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ చులకనగా మాట్లాడి ఆ రైతును అవమానించి ఆయన్ను షోరూమ్ లో నుంచి బలవంతంగా బయటకు పంపించేశాడు.

షోరూమ్ లో నుంచి బయటకు వెళ్లిన ఆ రైతు గంట తరువాత రూ. 10 లక్షలు నెట్ క్యాష్ ఎత్తుకుని నేరుగా వెళ్లి షోరూమ్ లో పెట్టి బోలేరో పిక్ వాహనం డెలవరీ ఇవ్వాలని చెప్పాడు. కార్లు స్టాక్ లేకపోవడంతో నాలుగు రోజులు సమయం కావాలని షోరూమ్ లోని ఆ సేల్స్ మెన్ చెప్పాడు. అంతే రైతుకు ఎక్కడో మండిపోయి నువ్వు ఎంత, నీ బతుకెంత ?, నా దగ్గర రూ. 10 రూపాయలు లేవు అంటావా ?, డబ్బు తెచ్చినా కారు ఇవ్వు అంటూ మండిపడటంతో అందరూ షాక్ అయ్యారు. అక్కడ జరిగిన తతంగా మొత్తం వీడియో తీసిన రైతు స్నేహితులు ఆ వీడియోను ఆనంద్ మహింద్రాకు ట్యాగ్ చేస్తూ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

Wife: సీక్రేట్ ఎఫెక్ట్, భార్య మొబైల్ ఫోన్ తో మెసేజ్ చేసిన భర్త, ఫ్రెండ్ ను పిలిపించి పక్కాప్లాన్ తో, ఫినిష్!Wife: సీక్రేట్ ఎఫెక్ట్, భార్య మొబైల్ ఫోన్ తో మెసేజ్ చేసిన భర్త, ఫ్రెండ్ ను పిలిపించి పక్కాప్లాన్ తో, ఫినిష్!

 ఎక్కువ మంది వ్యవసాయం చేస్తున్నారు

ఎక్కువ మంది వ్యవసాయం చేస్తున్నారు

కర్ణాటకలోని తమకూరు జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయం చేయిస్తున్నారు. తుమకూరు జిల్లాలో ప్రతినిత్యం 24 గంటలు నీరు అందుబాటులో ఉండటంతో అక్కడి రైతులు సంవత్సరం పూర్తిగా వ్యవసాయం చేస్తుంటారు. తుమకూరు జిల్లాలో ఎలాంటి పంటలు అయినా బాగా పండుతాయి. తుమకూరులో కెంపేగౌడ అనే రైతు నివాసం ఉంటున్నాడు.

 బోలేరో వాహనం కోసం వెళ్లిన కెంపేగౌడ

బోలేరో వాహనం కోసం వెళ్లిన కెంపేగౌడ

తుమకూరులో మహీంద్రా షోరూమ్ ఉంది. రైతు కెంపేగౌడ బోలేరో పిక్ అప్ వాహనం కొనుగోలు చెయ్యాలని కొంతకాలంగా అనుకుంటున్నాడు. మహీంద్రా షోరూమ్ లోకి రైతు కెంపేగౌడ తనకు బోలేరో పిక్ అప్ వాహనం కావాలని షోరూమ్ లో ఉన్న సిబ్బందికి చెప్పాడు. మహీంద్రా షోరూమ్ లో ఉన్న ఓ సేల్స్ మెన్ రైతు కెంపేగౌడ గెట్ అప్ చూసి ఓరి పిచ్చోడా బోలేరో పిక్ అప్ వాహనం ఖరీదు రూ. 10 లక్షలు, కనీసం నీ జోబులో రూ. 10 రూపాయలు అయినా ఉన్నాయా ? అని ఎగతాలిగా మాట్లాడాడు.

 గంటలో రూ. 10 లక్షలతో ప్రత్యక్షం అయిన రైతు

గంటలో రూ. 10 లక్షలతో ప్రత్యక్షం అయిన రైతు

రైతు కెంపేగౌడను అవమానంగా మాట్లాడిన మహీంద్రా షోరూమ్ సేల్స్ మెన్ నీది కారు కొనే ముఖమేనా అని అవమానించాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ చులకనగా మాట్లాడిన సేల్స్ మెన్ రైతు కెంపేగౌడను అవమానించి ఆయన్ను షోరూమ్ లో నుంచి బలవంతంగా బయటకు పంపించేశాడు. షోరూమ్ లో నుంచి బయటకు వెళ్లిన రైతు కెంపేగౌడ గంట తరువాత రూ. 10 లక్షలు నెట్ క్యాష్ ఎత్తుకుని నేరుగా వెళ్లి షోరూమ్ లో పెట్టి బోలేరో పిక్ వాహనం డెలవరీ ఇవ్వాలని చెప్పాడు.

 ఫోరూమ్ సిబ్బందికి సినిమా చూపించిన రైతు

ఫోరూమ్ సిబ్బందికి సినిమా చూపించిన రైతు

గంట ముందు అనామకుడిగా వచ్చిన రైతు కెంపేగౌడ గంటలో రూ. 10 లక్షలు క్యాష్ తో షోరూమ్ లో అడుగు పెట్టి కారు కావాలని చెప్పడంతో అంతకు ముందు ఆయన్ను అవమానించిన సేల్స్ మెన్ తో పాటు షోరూమ్ సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే టీ ఆర్డర్ చేసిన సిబ్బంది రైతు కెంపేగౌడను కుర్చోవాలని మర్యాద చేసి ఆయనకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేక సతమతం అయ్యారు.

 రైతు చాలెంజ్ కు మహీంద్రా కంపెనీ షోరూమ్ సిబ్బంది షాక్

రైతు చాలెంజ్ కు మహీంద్రా కంపెనీ షోరూమ్ సిబ్బంది షాక్

బోలేరో పిక్ అప్ వాహనాలు స్టాక్ లేకపోవడంతో నాలుగు రోజులు సమయం కావాలని షోరూమ్ లోని ఆ సేల్స్ మెన్ రైతు కెంపేగౌడకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అంతే రైతు కెంపేగౌడకు ఎక్కడో మండిపోయి నువ్వు ఎంత, నీ బతుకెంత ?, నా దగ్గర రూ. 10 రూపాయలు లేవు అంటావా ?, డబ్బు తెచ్చినా , ఇప్పుడు మర్యాదగా కారు డెలవరీ ఇవ్వు అంటూ మండిపడటంతో అందరూ షాక్ అయ్యారు.

 ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేసిన స్నేహితులు

ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేసిన స్నేహితులు

మీకు నేనే బోలేరో వాహనం కోనుగోలు చెయ్యడం ఇష్టం లేదు, మీ కంపెనీ కాకపోతే మాకు వేరే కంపెనీలు ఉన్నాయని, వాటినే కొంటాను అంటూ రైతు కెంపేగౌడ అసహనంతో మహీంద్రా షోరూమ్ లో నుంచి బయకటు వచ్చాడు. అయితే రైతు కెంపేగౌడకు ఆ షోరూమ సిబ్బంది, అంతకు ముందు ఆయన్ను అవమానించిన సేల్స్ మేన్ క్షమాపణలు చెప్పారు. అక్కడ జరిగిన తతంగా మొత్తం వీడియో తీసిన రైతు కెంపేగౌడ స్నేహితులు ఆ వీడియోను మహీంద్రా కంపెనీల యజమాని ఆనంద్ మహింద్రాకు ట్యాగ్ చేస్తూ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

English summary
Challenge: Farmer’s sweet revenge after Mahindra car showroom turned him away in Tumakuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X