Chanakya strategies exit poll: ఢిల్లీలో ఆ పార్టీకి ఏకపక్ష గెలుపు-తేల్చేసిన చాణక్య..!
ఢిల్లీ అసెంబ్లీకి ఇవాళ జరిగిన ఎన్నికలపై పలు ఎగ్డిట్ పోల్ సంస్థలు, సర్వే సంస్దలు, జాతీయ మీడియా సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ స్దాయిలో పలు సర్వేలు చేసిన చాణక్య స్ట్రాటజీస్ కూడా తమ ఎగ్జిట్ పోల్ అంచనాల్ని వెల్లడించింది. ఇందులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా సాగాయని తేల్చింది. ఇందులో రెండు జాతీయ పార్టీల మధ్య సాగిన పోరులో ఓటర్ల తీర్పు ఏకపక్షంగా ఉందని వెల్లడించింది.

చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఈసారి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్లు తేలింది. బీజేపీకి ఏకంగా 39 నుంచి 44 సీట్లు రాబోతున్నట్లు అంచనా వేశారు. అలాగే అధికార ఆప్ కు కేవలం 25 నుంచి 28 సీట్లు మాత్రమే రాబోతున్నట్లు తేలింది. కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 సీట్లు రావోచ్చని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. మిగతా ఎగ్జిట్ పోల్స్ తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి చాణక్య స్ట్రాటజీస్ ఎక్కువ సీట్లు ఇచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇందులో వరుసగా నాలుగోసారి గెలిచేందుకు ఆప్ చేసిన ప్రయత్నాల్ని విపక్ష బీజేపీ గట్టిగా అడ్డుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కేజ్రివాల్, మనీష్ సిసోడియా వంటి నేతలు జైలుకెళ్లడం వంటి పరిణామాలు ఆప్ ను కుంగదీసినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు నిరూపిస్తున్నాయి. అసలు ఫలితాల కోసం ఈ నెల 8వ తేదీ వరకూ ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications