వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం: స్వాగతం పలికిన సీఎం మనోహర్

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు.

ఇది వరకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన దత్తాత్రేయ ఇటీవల హర్యానాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. చండీగఢ్‌లో జరిగిన బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హాజరయ్యారు.

chandigarh: bandaru dattatreya takes oath as new governor of haryana

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ గతంలో పనిచేశారు. 1991, 98, 99, 2014లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసి గెలుపొందారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో రైల్వే మంత్రిగా, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

2019లో కేంద్ర ప్రభుత్వం దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది.
దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు బదిలీ కావడంతో.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్ బాధత్యలు చేపట్టారు.

Recommended Video

టీఆర్ఎస్ ఎంపీలు త్వరలో తమ పార్టీ మారబోతున్నరన్న దత్తాత్రేయ | TRS And Congress MPs Will Join In BJP

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొత్తం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి వరించింది. ఆయన మిచోరం గవర్నర్‌గా నియమితులయ్యారు.

English summary
chandigarh: bandaru dattatreya takes oath as new governor of haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X