• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రసవం కోసం వెళ్తే కడుపులో టవల్ పెట్టి కుట్లేసి గర్భిణీ ఉసురు తీసిన వైద్యులు .. భర్త ఫిర్యాదు

|

చండీగఢ్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన కారణంగా మహిళ మరణించింన ఘటన చోటు చేసుకుంది. దీంతో మహిళ భర్త రవీందర్ సింగ్ అతని బంధువులతో కలిసి చండీఘడ్ సివిల్ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నది మధ్యలో నిండు గర్భిణీ ప్రసవం..తల్లీ ,బిడ్డను కాపాడిన 108 టీమ్..ఏం చేశారంటేనది మధ్యలో నిండు గర్భిణీ ప్రసవం..తల్లీ ,బిడ్డను కాపాడిన 108 టీమ్..ఏం చేశారంటే

డెలివరీకి వెళ్తే దారుణం .. కడుపులో టవల్ పెట్టి కుట్లేయటంతో మహిళ మృతి

డెలివరీకి వెళ్తే దారుణం .. కడుపులో టవల్ పెట్టి కుట్లేయటంతో మహిళ మృతి

అసలేం జరిగిందంటే సిమ్లాపురి నివాసి రవీందర్ తన భార్యకు ప్రసవ నొప్పులు రావడంతో డిసెంబర్ 7 న సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డెలివరీ కోసం వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ శస్త్రచికిత్స డిసెంబర్ 8 న జరిగింది. శిశువు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, రవీందర్ భార్య నొప్పితో బాధపడుతోంది . మూత్ర విసర్జన చేయలేకపోయింది. దీంతో వైద్యులను సంప్రదించగా ఆమె ఉపశమనానికి, నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చారు. అయినప్పటికీ రెండు రోజుల పాట నొప్పి అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో వేరే ఆస్పత్రికి తరలించగా ఆమె కడుపులో టవల్ ఉన్నట్టు చెప్పారని , ఆ కారణంగా తన భార్య మృతి చెందిందని బాధితుడు పేర్కొన్నారు.

 వైద్యుల నిర్లక్ష్యం తన భార్య ప్రాణం తీసిందని భర్త ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యం తన భార్య ప్రాణం తీసిందని భర్త ఆందోళన

తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపమని సివిల్ ఆస్పత్రి వైద్యులు కోరానని , కాని వారు పాటియాలాలోని ప్రభుత్వ రాజీంద్ర ఆసుపత్రికి వెళ్ళమని చెప్పారని పేర్కొన్నారు. చివరగా, నేను ఆమెను డిసెంబర్ 11 న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (సిఎంసి & హెచ్) కి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు తన భార్యకు ఆపరేషన్ చేసి ఆమె గర్భంలో ఒక టవల్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రసవం కోసం సిజేరియన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం నా భార్య మరణానికి దారితీసిందని రవీందర్ అన్నారు.

హాస్పిటల్ ముందు నిరసన ..మృతురాలి భర్త ఫిర్యాదు , విచారణకు ఆదేశం

హాస్పిటల్ ముందు నిరసన ..మృతురాలి భర్త ఫిర్యాదు , విచారణకు ఆదేశం

దాదాపు గంటపాటు నిరసన నిర్వహించిన తరువాత, ఆపరేషన్ చేసిన వైద్యులు, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న సివిల్ సర్జన్ డాక్టర్ రాజేష్ బాగ్గా ఈ విషయంపై విచారణ జరిపారు. ఇవి తీవ్రమైన ఆరోపణలని , సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసాము, అని బగ్గా చెప్పారు. తల్లిని కోల్పోయి బిడ్డ అనాధ కాగా , భార్యను కోల్పోయిన భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

గతంలోనూ ఆస్పత్రిపై అనేక ఆరోపణలు

గతంలోనూ ఆస్పత్రిపై అనేక ఆరోపణలు

సివిల్ హాస్పిటల్ తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. మే 2019 లో, ప్రసూతి హాస్పిటల్ సిబ్బంది B + ఉన్న రోగికి A + రక్తాన్ని తప్పుగా మార్చారు. సమర్పించిన నివేదిక ఆధారంగా, నలుగురు డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డిఎన్‌బి) నివాసితులు, రక్త మార్పిడి అధికారి, ఒక స్టాఫ్ నర్సు మరియు ఒక మాట్రాన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం పై చండీఘడ్ సివిల్ ఆస్పత్రి పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Doctors are playing with people's life . recently doctors of civil hospital chandigarh forgot towel in stomch of a patient and the patient was died . govt hospital doctors left towel in the womb of a pregnant lady. the patient suffered with a severe pain and consulted the doctor .The matter came to light after the woman’s husband, Ravinder Singh staged a sit-in protest outside the mother and child unit of the civil hospital and demanded stringent action against the operating doctors and the staff for gross negligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X