కేజ్రీవాల్‌తో చేయి కలిపిన చంద్రబాబు! జగన్‌పై సీఎం నిప్పులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు ముఖ్యమంత్రులు, సుప్రీం, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో కలుసుకున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సదస్సు జరిగిన విషయం తెలిసిందే.
చంద్రబాబు దాదాపు పదిహేను మంది సీఎంలను స్వయంగా పలకరించారు. ఆ తర్వాత సదస్సుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎంలు అందరినీ వారివారి స్థానాల వద్దకు వెళ్లి పలకరించారు. తొలి సెషన్ ముగిసిన తర్వాత టీ బ్రేక్‌లో చంద్రబాబు, కేజ్రీవాల్‌లను పలకరించేందుకు ఎక్కువ మంత్రి సీఎంలు, ఉద్యోగులు ఆసక్తి చూపారు.
వారితో చాలామంది ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్, చంద్రబాబు పరస్పరం ఎదురైనప్పుడు చేతులు కలిపారు. ఢిల్లీ సీఎం ఆరోగ్యం గురించి ఆరా తీశారు. బాగానే ఉందని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

జగన్ పైన చంద్రబాబు మండిపాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది ఇస్తేనే రాష్ట్రానికి వెసులుబాటు అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కోరారు. రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక లోటు ుందని, సమానస్థాయి వచ్చే వరకు కేంద్రం సహకరించాలన్నారు.
ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ ప్రాజెక్టుకి వైయస్ అడ్డుపడగా ఇప్పుడు రాయలసీమవాసులకు నీరు అందించే ప్రయత్నానికి ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అవగాహన లేని స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు.
పట్టిసీమ వల్ల తమ ప్రాంతానికి నీళ్లొస్తాయని రాయలసీమవాసులు తెలుసుకున్నా జగన్ మాత్రం గ్రహించలేకపోతున్నారన్నారు. జగన్ ఢిల్లీకి వచ్చి అనవసరమైన ఫిర్యాదులు చేసి దివాళా కోరు రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. జగన్ ఢిల్లీకి వచ్చేది ఒకదాని కోసమైతే మాట్లాడేది మరొకటి అన్నారు.












Click it and Unblock the Notifications