బాబుకు పూలవర్షం: రావాలని బెంగళూర్లో (పిక్చర్స్)

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని, రాయితీలు పొందండని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బెంగళూరులో నిర్వహించిన సిస్కో సమావేశంలో పారిశ్రామికవేత్తలకు, ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు. సవాళ్లను అధిగమిస్తామని, రాజధాని పైన ఇబ్బందులు లేవన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు సంబంధించి ఫస్ట్‌ అమెరికన్‌ కార్పొరేషన్‌, ఐటీసీ ఇన్‌ఫోటెక్‌, ఇండియన్‌ ఎలక్ర్టానిక్స్‌ సెమీ కండక్టర్‌ అసోసియేషన్‌, ఎఫ్‌కేసీసీఐ, ఫ్లిప్‌కార్ట్‌, దివ్యశ్రీ, బీజీఆర్‌, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌, బీఈఎంఎల్‌, ఎన్‌టీటీఎఫ్‌, ఏబీబీ లిమిటెడ్‌ తదితర కంపెనీల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై మంతనాలు జరిపారు.

వీరందరూ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు అనంతరం మీడియాకు చెప్పారు. ఏపీలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిస్కో సంస్థ అంగీకరించిందని తెలిపారు. కాగా, బెంగళూరుకు విచ్చేసిన చంద్రబాబుకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు నీరాజనం పలికారు.

బెంగళూరు టీడీపీ ఫోరం చంద్రబాబును ఘనంగా సత్కరించింది. ఇదే సందర్భంగా హుద్‌హుద్‌ తుఫాను బాధితుల కోసం అభిమానులు, తెలుగు సంఘాలు, ఎన్డీఆర్‌ ఆశయ సాధన సమితి, తెలుగు విజ్ఞాన సమితి భారీగా విరాళాలు అందజేశాయి. పొరుగున ఉన్న తమిళనాడు హోసూరు నుంచి కార్యకర్తలు ఎన్ వెంకటేష్‌ నాయకత్వంలో చంద్రబాబును కలిశారు. పూలవర్షంతో అభిమానులు బాబుకు స్వాగతం పలికారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆకాశమే హద్దుగా ఉందని ఐటీ, బీటీ, మౌలిక సదుపాయాలు, సేవల కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

బెంగళూరులోని ఐటీసీ గార్డెనియాలో భారత పరిశ్ర మల సమాఖ్య (సీఐఐ) మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సదస్సులో బాబు ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రానున్న దశాబ్ద కాలంలోనే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, దీనికి ఐటీ, బీటీ కంపెనీలు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. దేశంలోని అతి పెద్ద కోస్తా తీరం నవ్యాంధ్రలో ఉందని ఓడ రేవుల సంఖ్యను 14కు పెంచడం ద్వారా సౌత్ ఈస్ట్‌ ఏషియా దేశాలకు ఎగుమతుల అవకాశాలు కల్పిస్తామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అయితే వీటన్నింటినీ విజయవంతంగా అధిగమించగలమన్న ఆత్మ విశ్వాసం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కాంపిటీటివ్‌ ఇన్నోవేటివ్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియాల రూపకల్పనలో నవ్యాంధ్ర ప్రదేశ్‌ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, కొద్దిపాటి సమస్యలు కూడా త్వరలోనే సమసిపోతాయని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

బెంగళూరుకు అతిసమీపాన ఉన్న అనంతపురం, హిందూపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లకు సరిపడినన్ని భూములున్నాయని, ఈ ప్రాంతాల్లో పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాలు అందుకోవచ్చున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

భారత్‌లో మేథస్సుకు కొదువ లేదని, రానున్న 10-15 ఏళ్లలో అమెరికా, చైనాలకు మించిన స్థాయిలో సాంకేతిక అభివృద్ధి ఇక్కడే సాధ్యమన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చాలెంజింగ్‌గా ఉన్నా.. ప్రపంచం మెచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశం కూడా తనకే దక్కిందని చంద్రబాబు అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆధార్‌ ద్వారా 8 లక్షల బోగస్‌ పింఛన్లు, 6.5 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేశామన్నారు. ఈ కార్డును అన్ని పథకాలకు అనుసంధానం చేస్తామని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇదంతా ఐటీ ద్వారానే సాధ్యమైందని చెప్పారు. న్యూటానిక్స్‌ సీఈఓ ధీరజ్‌ పాండే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణలతో పాటు పలువురు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పొల్గొన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాలతో తాను ఎప్పుడూ సన్నిహితంగా ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి కర్ణాటక సీఎంతో చర్చలు జరిపేందుకు ఈ నెల 10వ తేదీన తిరిగి బెంగళూరుకు వస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+