కోల్ కత చేరుకున్న చంద్రబాబు: కేంద్రంపై యుద్ధానికి ఆయనా రెడీ
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కోల్ కత చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. కేంద్రంపై వ్యతిరేకంగా పోరాడుతున్న మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు కోల్ కతకు వెళ్లారు. చంద్రబాబుతో పాటు కొందరు యూపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా మమతతో సమావేశం అవుతారని తెలుస్తోంది.
శారద, రోజ్ వ్యాలీ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను కోల్ కత పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ మమతా బెనర్జీ రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధర్నాకు దిగారు. ఉద్దేశపూరకంగానే కేంద్ర ప్రభుత్వం సీబీఐని తమపై ప్రయోగించిందని ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ చేస్తోన్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి తాను కోల్ కత చేరుకున్నట్లు చంద్రబాబు విమానాశ్రయంలో తనను కలిసి విలేకరులకు చెప్పారు.

మరోసారి అధికారంలోకి రావడానికి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సీబీఐని ప్రయోగించిందని ఆరోపించారు. కేంద్రం కుట్రలను మమతా బెనర్జీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ధర్నా చేయడం గొప్ప విషయమని చెప్పారు. కాంగ్రెస్ సహా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు మమతా బెనర్జీకి అండగా ఉన్నాయని అన్నారు.
ఈవీఎంలను కూడా కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని చంద్రబాబు అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తాను.. ఇదే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు. వీవీ ప్యాట్లను కూడా లెక్కిస్తేనే, అసలైన ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు.

Click it and Unblock the Notifications