Chandrayaan 3: చంద్రుడికి చేరువలో చంద్రయాన్-3.. ఇక ల్యాండింగే..!
చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి సమయం అసన్నమైంది. నిన్నటి వరకు చంద్రుడికి 177 కిలో మీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్ 3 బుధవారం చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరానికి వెళ్లింది. ఇస్రో వ్యోమనౌక చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భారత వ్యోమనౌక చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లుx163 కిలో మీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్ట్ 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ ను వేరు చేయడానికి ఆగస్టు 17, 2023న ప్లాన్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది. గురువారం నుంచి ల్యాండర్ వేగం నెమ్మదిస్తుందని ఇస్రో తెలిపింది. ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ల్యాండింగ్‌లో కీలకమైన భాగం ల్యాండర్ వేగాన్ని 30 కి.మీ ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు తీసుకురావడం, అంతరిక్ష నౌకను అడ్డం నుంచి నిలువు దిశకు బదిలీ చేయడం కీలక ప్రక్రియ ముందుందని ఇస్రో తెలిపింది.

జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టారు. చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రడి కాక్ష్యలో ప్రవేశపెట్టారు. చంద్రయాన్ 3 విజయవంతమైతే, యుఎస్‌ఎస్‌ఆర్, యుఎస్, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.భారత్ కు పోటీగా ఆగస్టు 11న చంద్రుడిపైకి లునా-25 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలో వోస్తోక్నీ కాస్మో డ్రోమ్ నుంచి ఈ ప్రయోగం చేసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ పేర్కొంది. ఈ ప్రయోగాన్ని గత శుక్రవారం తెల్లవారుజామున 2:10 గంటలకు చేశారు.












Click it and Unblock the Notifications