కూతురిపై రేప్: ఫ్రెంచ్ అధికారిపై అభియోగాలు

కేసు విచారణను న్యాయమూర్తి ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేసారు. విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి పాస్కల్‌పై తగిన ఆధారాలు ఉన్నాయంటూ కోర్టు ఇంతకు పాస్కల్ డిశ్చార్జీకి నిరాకరించింది.
తాను నేరం చేసినట్లుగా దర్యాప్తులో ఇప్పటి వరకు ఆధారాలు లేనందున తనపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని అంటూ పాస్కల్ తనను కేసు నుంచి విముక్తం చేయాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు. కేరళకు చెందిన ఆయన భార్య సుజా జోన్స్ ముజరీర్ ఫిర్యాదు మేరకు పాస్కల్‌పై కేసు నమోదైంది. దాంతో 2012 జూన్ 12వ తేదీన పోలీసులు ఆయనను అరెస్టు చేసారు.
పాస్కల్‌కు నేరంలో భాగం ఉందనే విషయం విచారణలో తేలుతుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిటి వెంకటేష్ అన్నారు. చిన్నారికి మత్తు మందు ఇచ్చినట్లు కూడా రుజువులున్నాయని ఆయన అన్నారు. తమ క్లయింట్ నిర్దోషి అని, డిఎన్ఎ పరీక్షలో కూడా ఏమీ తేలలేదని పాస్కల్ తరఫు న్యాయవాది అన్నారు.












Click it and Unblock the Notifications