ఛత్తీస్ గడ్ లో హోరాహోరీగా పోరు.. బీజీపీ కి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్

దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని పూజలు ,ప్రార్ధనలు చేస్తున్నాయి . ఛత్తీస్ గడ్ గిరిజన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 11 లోక్ సభ స్థానాలకు మూడు దశల్లో ఓటు వేసింది. బిజెపి ఎల్లప్పుడూ విజయం సాధించినప్పటికీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బిజెపిని ఓటమి పాలు చేసింది . లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీగా కాంగ్రెస్ బీజేపీతో పోరాడుతుంది.

ఛత్తీస్ గడ్ లోని 11 లోక్సభ స్థానాల్లో 2014 లో మోడీ వేవ్ తో భారతీయ జనతా పార్టీ (బిజెపి) 10 స్థానాలకు దక్కించుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. బిజెపికి 49 శాతం ఓట్లు లభించగా కాంగ్రెస్ కు 39 శాతం ఓటింగ్ లభించింది. 2014 లో గెలుపొందిన ఏకైక సీట్ లో ఈ సారి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోంది. దుర్గ్ లో బిజెపికి చెందిన విజయ్ బాఘెల్ 16671 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు .

Chattisgarh Congress is giving tough fight for BJP... Both parties are in leading 5 seats each

2019 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఛత్తీస్ గడ్ లో బిజెపి తో పోటా పోటీగా తలపడుతుంది. . బీజేపీ 5 సీట్లలో , కాంగ్రెస్ 5 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది . సర్వర్ సమస్యలు కారణంగా కంకేర్లో లెక్కింపు నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడిందనే భావన వ్యక్తం అవుతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+