Cheating: కరోనా ఫస్ట్ వేవ్ లో లవ్ మ్యారేజ్, సెకండ్ వేవ్ లో ప్రియుడితో సెకండ్ మ్యారేజ్, థర్డ్ వేవ్ లో ?
కాన్పూర్/చెన్నై: రెండు సంవత్సరాలు కలిసిమెలసి తిరిగిన ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరు ఇష్టపడ్డారని, పిల్లలు పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటే మనం ఎందుకు కాదనాలని, వారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాము కదా అని ఆలోచించిన ఇరు వైపుల కుటుంబ సభ్యులు ఆర్య సమాజం ఆలయంలో కరోనా ఫస్ట్ వేవ్ లోనే పెళ్లి చేశారు. అమ్మాయికి ఆమె కుటుంబ సభ్యులు భారీగానే బంగారు నగలు ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో నాలుగు నెలలు భార్య చక్కగా కాపురం చేసింది.
ఐదు నెలల తరువాత పుట్టింటి వాళ్లు, అత్తారింటి వాళ్లు ఇచ్చిన బంగారు నగలు ఎత్తుకుని పుట్టింటికి వెళ్లిన భార్య తరువాత నీతో నేను రాను అంటూ భర్తకు తేల్చి చెప్పి పుట్టింటిలోనే ఉండిపోయింది. కోపంలో భార్య రాలేదని ఐదు నెలల నుంచి తన భార్య తిరిగి వస్తుందని భర్త ఎదురు చూశాడు. అదే సమయంలో భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రేమించిన వ్యక్తిని ఎక్కడైతో మొదటిసారి పెళ్లి చేసుకుందో కరోనా సెకండ్ వేవ్ సందర్బంగా మరో వ్యక్తితో అదే ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో భార్య రెండో పెళ్లి చేసుకుంది. భార్య రెండో పెళ్లి వీడియో భర్తకు చేరడంతో అతను లబోదిబో అంటూ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.
Recommended Video
Illegal
affair:
భార్యకు
క్యూలో
ఇద్దరు
ప్రియులు,
నిరుద్యోగి
భర్త,
కోసి
కాలువలో
విసిరేసి
!

ప్రేమపారువరాలు.... ప్రేమ పక్షులు
ఉత్తరప్రేదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని బాబూపార్ లో అమిత్ శర్మా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాన్పూర్ జిల్లాలోని గోవింద్ నగర్ లో రుచి వర్మా అనే యువతి నివాసం ఉంటున్నది. మూడు సంవత్సరాల క్రితం అమిత్ శర్మా, రుచి వర్మాకు పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు.

ప్రేమలో పడ్డారు
రెండు సంవత్సరాల క్రితం రుచి వర్మా, అమిత్ శర్మా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి కలిసిమెలసి తిరిగిన ప్రేమికులు రుచి వర్మా, అమిత్ శర్మా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అమిత్ శర్మా, రుచి వర్మా ఇద్దరు ఇష్టపడ్డారని, పిల్లలు పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటే మనం ఎందుకు కాదనాలని, వారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాము కదా అని ఇరుకుటుంబ సభ్యులు ఆలోచించారు.

కరోనా ఫస్ట్ వేవ్ లో ప్రేమపెళ్లి
పెళ్లికి అంగీకిరించిన ఇరు వైపుల కుటుంబ సభ్యులు 2020 జూన్ 4వ తేది ఆర్య సమాజం ఆలయంలో కరోనా ఫస్ట్ వేవ్ లోనే రుచి వర్మా, అమిత్ శర్మా పెళ్లి చేశారు. పెళ్లి సందర్బంగా రుచి వర్మాకు అమ్మాయి కుటుంబ సభ్యులు భారీగానే బంగారు నగలు ఇచ్చి అత్తారింటికి సంతోషంగా పంపించారు.

అంతా హ్యాపీనే అనుకుంటే......ఆ రోజు ?
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అమిత్ శర్మాతో నాలుగు నెలలు భార్య రుచి వర్మా చక్కగా కాపురం చేసింది. నవ దంపతులు వారి బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. బైక్ లో అప్పుడప్పుడు షికార్లకు తిరిగారు. పెళ్లి జరిగిన నాలుగు నెలల తరువాత రుచి వర్మా తాను పుట్టింటికి వెళ్లి వస్తానని భర్త అమిత్ శర్మాకు చెప్పడంతో అతను సరే అన్నాడు.

నగలు సర్దుకుని చెక్కేసిన భార్య
ఐదు నెలల క్రితం రుచి వర్మా ఆమె పుట్టింటి వాళ్లు, అత్తారింటి వాళ్లు ఇచ్చిన బంగారు నగలు, భర్త ఇంట్లో నగదు ఎత్తుకుని పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజులకు పుట్టింటిలో ఉన్న భార్య రుచి వర్మాకు ఆమె భర్త అమిత్ శర్మా పదేపదే ఫోన్లు చేశాడు. భార్యకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది.

నేను రానుపోరా
అమిత్ శర్మా నేరు భార్య పుట్టింటికి వెళ్లి ఆమెను ఇంటికి పిలిచాడు. నీతో నేను రాను, నీతో కాపురం చెయ్యను అంటూ భర్త అమిత్ శర్మాకు అతని భార్య రుచి వర్మా తేల్చి చెప్పి పుట్టింటిలోనే ఉండిపోయింది. భార్య రుచి వర్మా తన మీద కోపంతో ఇంటికి రాలేదని, తన భార్య తిరిగి వస్తుందని భర్త అమిత్ శర్మా ఇంతకాలం ఎదురు చూశాడు.

కరోనా సెకండ్ వేవ్ లో భార్య సెకండ్ మ్యారేజ్
సోషల్ మీడియా పుణ్యమా అంటూ మూడు రోజుల క్రితం భర్త అమిత్ శర్మా మొబైల్ నెంబర్ వాట్సాప్ కు ఓ వీడియో వచ్చింది. వీడియో చూసిన అమిత్ శర్మా మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ వీడియోలో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రుచి వర్మా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం గుర్తించిన అమిత్ శర్మా దిమ్మతిరిగిపోయింది. పుట్టింటిలో ఉన్న రుచి వర్మా కరోనా వైరస్ సెకండ్ వేవ్ సందర్బంగా 2021 ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న భర్త అమిత్ శర్మా పోలీసులను ఆశ్రయించాడు.

ఒకే చోట రెండు పెళ్లిళ్లు చేసుకున్న భార్య
ఎక్కడైతే అమిత్ శర్మాను పెళ్లి చేసుకుందో రెండో పెళ్లి కూడా అదే ఆర్య సమాజ ఆలయంలో రుచి వర్మా రెండో పెళ్లి చేసుకుంది. తన మీద కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిన రుచి వర్మా అక్కడ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతన్నే రెండో వివాహం చేసుకుందని, మా బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లిపోయిందని, తనకు న్యాయం చెయ్యాలని అమిత్ శర్మా పోలీసులను ఆశ్రయించాడు. ఒకేచోట ఒకే యువతికి రెండు పెళ్లిళ్లు ఎలా చేశారు ?, ఆమె ఎందుకు ఇలా చేసింది ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే రుచి వర్మా మరో పెళ్లి చేసుకుంటుందా ? అంటూ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.