చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: కేటుగాడు పక్కా కన్నింగ్, అధికారి సంతకం ఫోర్జరీ చేసి రూ. 90 లక్షలు లూటీ, ఏదో అనుకుంటే !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కడలూరు: మేజర్ మునిసిపాలిటీ కార్యాయలంలో కాంట్రాక్టు పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడు అక్కడి అధికారులతో పాటు సిబ్బందితో పరిచయాలు పెంచుకున్నాడు. అధికారులతో నమ్మకంగా ఉంటున్న ఆ యువకుడు రూ. లక్షల్లో బిల్లులు చెల్లించడానికి అధికారుల దగ్గర చెక్కుల మీద సంతకాలు తీసుకుంటున్నాడు. ఒక్కొక్క చెక్కు రూ. 50 లక్షలకు పైగా కూడా ఉంటుంది. మునిసిపాలిటీలో కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రతినెల కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నారు. అటీవల సీనియర్ అధికారి సంతకం ఫోర్టరీ చేసి రూ. 90 లక్షలు తీసుకున్నారని వెలుగు చూసింది. తన సంతకం ఫోర్టరీ అయ్యిందని, రూ. 90 లక్షల విలువైన రెండు చెక్ ల మీద తాను సంతకాలు చెయ్యలేదని ఎగ్జిక్యూటీవ్ అధికారులు పోలీసులకు, ఆయన పై అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మునిసిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కేటుగాడిని అరెస్టు చెయ్యడంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది హడలిపోయారు.

Illegal affair: ప్రియురాలి మోజులో కాలేజ్ అబ్బాయి, ఆంటీతో ఎంజాయ్, చివరికి ఏం చేశాడంటే?, క్లైమాక్స్!Illegal affair: ప్రియురాలి మోజులో కాలేజ్ అబ్బాయి, ఆంటీతో ఎంజాయ్, చివరికి ఏం చేశాడంటే?, క్లైమాక్స్!

 కంప్యూటర్ ఆపరేటర్

కంప్యూటర్ ఆపరేటర్

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిందబరం సమీపంలోని భువనగిరి మేజర్ మునిసిపాలిటి. భువనగిరి మునిసిపాలిటీకి తమిళనాడు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నది. భువనగిరి మునిసిపాలిటీ ఆఫీసులో కీలమనక్కుడికి చెందిన వీరమణి (29) అనే యువకుడు కాంట్రాక్టు పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

 అధికారుల దగ్గర అమాయకుడు

అధికారుల దగ్గర అమాయకుడు

మేజర్ భువనగిరి మునిసిపాలిటీ కార్యాయలంలో కాంట్రాక్టు పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్న వీరమణి ఆ కార్యాలయంలోని అధికారులతో పాటు సిబ్బందితో పరిచయాలు పెంచుకున్నాడు. అధికారులతో నమ్మకంగా ఉంటున్న వీరమణి రూ. లక్షల్లో బిల్లులు చెల్లించడానికి అధికారుల దగ్గర చెక్కుల మీద సంతకాలు తీసుకుంటున్నాడు.

 రూ. 90 లక్షలు గోల్ మాల్

రూ. 90 లక్షలు గోల్ మాల్

ఒక్కొక్క చెక్కు రూ. 50 లక్షలకు పైగా కూడా ఉంటుంది. భువనగిరి మునిసిపాలిటీలో కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రతినెల కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నారు. ఇటీవల సీనియర్ ఎగ్జిక్యూటీవ్ అధికారి అరుల్ కుమార్ సంతకం ఫోర్టరీ చేసి రూ. 90 లక్షలు తీసుకున్నారని, అది గోల్ మాల్ అయ్యిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

 కంప్యూటర్ ఆపరేటర్ కన్నింగ్

కంప్యూటర్ ఆపరేటర్ కన్నింగ్

తన సంతకం ఫోర్టరీ అయ్యిందని, రూ. 90 లక్షల విలువైన రెండు చెక్ ల మీద తాను సంతకాలు చెయ్యలేదని ఎగ్జిక్యూటీవ్ అధికారి అరుల్ కుమార్ భువనగిరి పోలీసులకు, ఆయన పై అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మునిసిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కేటుగాడు వీరమణిని అరెస్టు చెయ్యడంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది హడలిపోయారు.

 రూ. కోటికి రూ. 6 వేలు తక్కువ అంతే

రూ. కోటికి రూ. 6 వేలు తక్కువ అంతే

సీనియర్ అధికారి అరుల్ కుమార్ సంతకాన్ని కంప్యూటర్ ఆపరేటర్ వీరమణి రెండు చెక్కుల్లో ఫోర్జరీ సంతకాలు చేసి చేసి రూ. 90, 93, 400 డ్రా చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వీరమణి నుంచి అతని కారు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని భువనగిరి పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Cheating: Computer operator arrested for fraudulently signing Rs 90 lakh near Cuddalore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X