వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాన్ ఎఫెక్ట్: ఔషధాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో మందుల కొరత తప్పదు

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం గతవారం 328 ఔషధాలపై నిషేధం విధించింది. దీంతో మరి కొన్ని నెలలపాటు యాంటిబయోటిక్స్ అనల్జెసిక్స్, యాంటీ డయాబెటిక్స్, స్టాక్ తక్కువగా ఉంటుందని కెమిస్టులు హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి సరిపడా స్టాక్ ఉందని.. పేషెంట్లు ఆందోళన చెందొద్దని వైద్యులు చెబుతున్నారు. నిషేధం అయిన వాటిలో.. జిఫి ఆజ్, నార్ మెట్రోజిల్, నాసివియాన్ క్లాసిక్ అడల్ట్ స్ప్రే, చెస్టన్ కోల్డ్, టోటల్, అజిత్రల్ ఏ, నిసిప్ కోల్డ్ & ఫ్లూ, సుప్రీమాక్స్ ప్లస్, రిడాల్ ఒజ్, ఆస్కారిల్ డీ, విస్కోడైన్‌లతో పాటు మరికొన్ని డ్రగ్స్ ఉన్నాయి.

<strong>328 కాంబినేషన్ మెడిసిన్స్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం</strong>328 కాంబినేషన్ మెడిసిన్స్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం

మరో రెండో నెలలు పాటు స్టాక్ కష్టమే

మరో రెండో నెలలు పాటు స్టాక్ కష్టమే

8లక్షలకు పైగా మెడిసిన్లు అమ్ముతున్న ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, ఇప్పటికే నిషేధంలో ఉన్న మందులను హోల్‌సేలర్లకు తిరిగి పంపుతున్నాయి. వారు అక్కడి నుంచి మందులు తయారైన ఫార్మా కంపెనీలకు పంపుతారు. నిషేధంలో ఉన్న ఔషధాలు తక్షణమే అమల్లోకి రావడంతో కస్టమర్లకు కాస్త ఇబ్బంది పడతారని అన్నారు ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షుడు జేఎస్ షిండే.

రానున్న కొన్ని నెలల్లో యాంటీబయోటిక్స్ దొరకడం చాలా కష్టంగా మారుతుందని ఆయన చెప్పారు. మందుల కొరత ఏర్పడుతుందన్నారు షిండే. అంతేకాదు ఈ మందులన్నిటినీ సెపరేట్ చేసి తిరిగి పంపాలి కాబట్టి కొన్ని రోజుల పాటు మందుల దుకాణాలు కూడా మూసివేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అన్ని మందులను రీప్లేస్ చేసేందుకు కనీసం 60 రోజులు పడుతుందని షిండే తెలిపారు.

పేషెంట్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు

పేషెంట్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు

ఇదిలా ఉంటే నిషేధంలో ఉన్న మందులను పేషెంట్లకు సూచించడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మూడు డోసులు ఒకే డోసులో తీసుకునే పద్ధతినితాము సూచించలేదని డాక్ట్ అనూప్ మిశ్రా చెప్పారు. రెండు డోసులు ఒకే డోసుగా తీసుకునే పద్ధతినే సూచించినట్లు చెప్పారు. అయితే మందులు నిషేధం కావడంతో పేషెంట్లు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు వైద్యులు. సింగిల్ డోస్ డ్రగ్స్ చాలా ఉన్నాయని డాక్డర్ మిశ్రా స్పష్టం చేశారు.

ఫార్మా ఇండస్ట్రీకి భారీ నష్టం

ఫార్మా ఇండస్ట్రీకి భారీ నష్టం

మరోవైపు ప్రభుత్వం పలు మందులపై నిషేధం విధించడంతో వ్యాపారానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. నిషేధం గురైన మందులు టర్నోవర్ రూ.1040 కోట్లుగా ఉందని ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం తెలిపింది. మందులు బ్యాన్ కావడంతో ఆ ప్రభావం దాదాపు 1360 మెడిసిన్ బ్రాండ్‌లపై పడుతుందని వెల్లడించింది. మందుల నిషేధంతో ఎక్కువగా నష్టపోయేది మాక్లియాడ్స్ ఫార్మా షూటికల్స్ అని తెలుస్తోంది. దీని వార్షిక టర్నోవర్ రూ.292 కోట్లు. ఇక నష్టపోయిన మిగతా ఫార్మా కంపెనీల్లో మ్యాన్‌కైండ్ ఫార్మాసూటికల్స్ (రూ. 65 కోట్లు), ఆల్కెమ్ లాబొరేటొరీ (రూ.58 కోట్లు), ఎఫ్‌డీసీ లిమిటెడ్ (రూ.58 కోట్లు), మెడ్లీ ఫార్మాసూటికల్స్ (రూ.41కోట్లు)ఉన్నాయి.

English summary
https://telugu.oneindia.com/news/india/govt-bans-manufacture-sale-328-combination-drugs-232991.html
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X