Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

చెన్నై/బెంగళూరు: వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. 10 లక్షల నగదుతో పాటు ఐదు సవర్ల బంగారు నగలు టూటీ చేసి తన ప్రియురాలు పారిపోయిందని చెన్నై నగరంలో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని తనను నిలువునా మోసం చేసిందని, ఉద్యోగం ఇచ్చినందుకు తనను నిలువు దోపిడీ చేసిందని, ఆమె ఎక్కడ ఉన్నా అరెస్టు చెయ్యాలని, ఆమె మాజీ పంచాయితీ అధ్యక్షురాలని, రాజకీయ నేతలు ఆమెకు పరిచయం ఉన్నారని పారిశ్రామికవేత్త చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎర్రగా బుర్రగా బలంగా ఉండటంతో కంపెనీ ఎండీకి పంగనామాలు పెట్టి పరారైంది.

భారత్, దుబాయ్ లో కంపెనీలు

భారత్, దుబాయ్ లో కంపెనీలు

చెన్నైలోని పల్లికరనై ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలచందర్ (39) అనే వ్యక్తి చెన్నై, ముంబై, పళని, దుబాయ్ లో గ్లోబల్ టచ్ పేరుతో అనేక కంపెనీలు నిర్వహిస్తున్నాడు. దుబాయ్, చెన్నై, పళని, ముంబైలోని బాలచందర్ కంపెనీలో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉద్యోగం చేస్తున్నారు.

కంపెనీ ఎండీకి భార్య, పిల్లలు

కంపెనీ ఎండీకి భార్య, పిల్లలు

గ్లోబల్ టచ్ కంపెనీల వ్యవస్థాపకుడు బాలచందర్ కు ఇంతకు ముందే వివాహం అయ్యింది. బాలచందర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015లో బాలచందర్ భార్య మరణించింది. బాలచందర్ ఇద్దరు పిల్లలు అతని మామ ఇంట్లో నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. బాలచందర్ అప్పుడప్పుడు పిల్లలు నివాసం ఉంటున్న చోటకు వెళ్లి వారి బాగోగులు చూసుకుంటున్నాడు.

మాజీ పంచాయితీ అధ్యక్షురాలు

మాజీ పంచాయితీ అధ్యక్షురాలు

చెన్నైలోని వడవళనిలోని బాలచందర్ కంపెనీ బ్రాంచ్ కు కొన్ని నెలల క్రితం ఓ మహిళ వెళ్లింది. తరువాత తనపేరు మయూర వర్షిణి (38) అని బాలచందర్ ను పరిచయం చేసుకుంది. అంతే కాకుండా తన సొంత ఊరు బెంగళూరు అని, తాను మాజీ పంచాయితీ అధ్యక్షురాలు అని బాలచందర్ కు కొన్ని వివరాలు చెప్పింది.

పెళ్లి కాని అందమైన అంటీ !

పెళ్లి కాని అందమైన అంటీ !

తనకు నచ్చినవాడు ఇంత వరకు చిక్కలేదని, అందుకే 38 ఏళ్లు అయినా ఇంకా వివాహం చేసుకోలేదని మయూర వర్షిణి కంపెనీ యజమాని బాలచందర్ కు చెప్పిందని సమాచారం. ఇదే ఏప్రిల్ నెలలో బాలచందర్ కంపెనీలో మయూర వర్షిణి ఉద్యోగంలో చేరింది. తరువాత కంపెనీ విషయాల గురించి, ఆఫీస్ వేళలు పూర్తి అయిన తరువాత బాలచందర్ తో మయూర వర్షిణి చాలా సార్లు ఎండీ బాలచందర్ తో మాట్లాడేది.

కంపెనీ ఎండీని ముగ్గులోకి దింపింది

కంపెనీ ఎండీని ముగ్గులోకి దింపింది

బాలచందర్ తో చనువు పెంచుకున్న మయూర వర్షిణి అతన్ని చిన్నగా ముగ్గులోకి దింపింది. కంపెనీ ఉద్యోగులు సాయంత్రం ఇంటికి వెళ్లిపోయినా మయూర వర్షిణి మాత్రం ఆఫీస్ లోనే ఉంటూ బాలచందర్ తో కాలక్షేపం చేసింది. తరువాత బాలచందర్, మయూర వర్షిణి సినిమాలు, షికార్లు, పార్క్ లు తిరగడం మొదలుపెట్టారు.

ఎర్రగా బుర్రగా బలంగా ఉందని !

ఎర్రగా బుర్రగా బలంగా ఉందని !

మయూర వర్షిణి చూడటానికి ఎర్రగా, బుర్రగా, బలంగా ఉండటంతో బాలచందర్ ఆమె వలలో పడిపోయాడు. కంపెనీ వ్యవహారాలు అంటూ బాలచందర్, మయూర వర్షిణిలు ముంబై, దుబాయ్, పళని తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలకు వెళ్లి పని పూర్తి అయిన తరువాత అక్కడే హోటల్ లో రూంలు తీసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. తరువాత విహారయాత్రలకు వెళ్లి ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. కొన్ని నెలల్లోనే బాలచందర్ పూర్తిగా మయూర వర్షిణికి సరండర్ అయిపోయాడు.

పెళ్లి చేసుకుందాం రా డార్లింగ్

పెళ్లి చేసుకుందాం రా డార్లింగ్

మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని, మీ ఇద్దరు పిల్లలను బాగాచూసుకుంటానని మయూర వర్షిణి బాలచందర్ ను నమ్మించింది. తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు పరిష్కారం అయిన వెంటనే పెళ్లి చేసుకుందామని మయూర వర్షిణి బాలచందర్ కు మాయమాటలు చెప్పింది. మయూర వర్షిణి చెప్పిందే బాలచందర్ కు వేదం అయ్యింది. అంతలా మయూర వర్షిణికి అతను లొంగిపోయాడు.

రూ. 10 లక్షలు, 5 సవర్ల నగలతో ఎస్కేప్

రూ. 10 లక్షలు, 5 సవర్ల నగలతో ఎస్కేప్

మయూర వర్షిణి కొన్ని రోజుల క్రితం మాయం అయ్యింది, మయూర వర్షిణి మొబైల్ స్వీచ్ ఆఫ్ అయ్యింది. తెలిసిన చోట్ల మొత్తం వెతికినా మయూర వర్షిణి ఆచూకి మాత్రం చిక్కకపోవడంతో బాలచందర్ కు అనుమానం వచ్చింది. పెళ్లి పేరుతో మయూర వర్షిణి తనను పూర్తిగా మోసం చేసిందని తెలుసుకున్న బాలచందర్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. రూ. 10 లక్షల నగదుతో పాటు ఐదు సవర్ల బంగారు నగలు లూటీ చేసిందని, ఆమెకు రాజకీయ నాయకులు పరిచయం ఉన్నారని, మయూర వర్షిణి ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్టు చెయ్యాలని బాలచందర్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. బాలచందర్, మయూర వర్షిణి కలిసి తీసుకున్న ఫోటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+