తెగబడ్డ ప్రేమోన్మాది: పెళ్లి చేయమని ఎంతకి తెగించాడంటే?.. చెన్నైలో విషాదం

Subscribe to Oneindia Telugu
  ఒక ప్రేమోన్మాది ఎంతకి తెగించాడంటే? A Girl Lost Life By Psycho Lover

  చెన్నై: ఓ ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో యువతి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమెకు నిప్పంటించి కాల్చి చంపేశాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యులకూ నిప్పంటించాడు. చెన్నై నగర శివారులోని ఆదంబాక్కంలోని శాస్త్రినగర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

  పోలీసుల కథనం ప్రకారం:

  పోలీసుల కథనం ప్రకారం:

  ఆదంబాక్కంలోని శాస్త్రినగర్‌ 7వ వీధికి చెందిన షణ్ముఖం-రేణుక దంపతులలకు ఇందుజ(21), నివేదిత అనే ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇందుజ స్కూల్లో ఉన్నప్పటి నుంచే వేళచ్చేరికి చెందిన ఆకాష్‌(22) అనే యువకుడితో ప్రేమలో ఉంది.

  ఇంట్లోవాళ్ల మందలింపు:

  ఇంట్లోవాళ్ల మందలింపు:


  కొద్దిరోజుల క్రితం ఇందుజ ప్రేమ వ్యవహారం వాళ్లింట్లో తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో అప్పటినుంచి ఇందుజ ఆకాష్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇందుజపై ఆకాష్ కక్ష పెంచుకున్నాడు. ఇందుజ మాట్లాడకపోయినా సరే.. ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఇందుజ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

  ఇందుజ ఇంటికెళ్లి:

  ఇందుజ ఇంటికెళ్లి:

  సోమవారం రాత్రి 8.45గం.కు ఆకాష్ ఇందుజ ఇంటికెళ్లాడు. ఇందుజను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు వారు ఎలా స్పందించారో తెలియదు గానీ.. ఆకాష్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. తన వెంట తీసుకెళ్లిన టర్పంటాయిల్ ను తొలుత ఇందుజపై, ఆ తర్వాత ఆమె తల్లి రేణుక, చెల్లి నివేదిత, తమ్ముడిపై కుమ్మరించాడు. ఆ సమయంలో ఇందుజ తండ్రి ఇంటివద్ద లేడు.

  లైటర్‌తో నిప్పంటించి:

  లైటర్‌తో నిప్పంటించి:


  టర్పంటాయిల్ పోసిన తర్వాత వారందరిని బలవంతంగా ఇంట్లోకి నెట్టి లైటర్‌తో నిప్పంటించాడు. దీంతో ఇందుజ అక్కడికక్కడే మరణించగా ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కీళ్పాక్కంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రేణుక పరిస్థితి విషమించిందని పోలీసులు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A young engineer in Chennai was burnt alive last night allegedly by a former classmate who had been stalking her for about a month. S Induja, was set on fire at the doorstep of her home in the city's Adambakkam area.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి