గీతాలక్ష్మి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు: ఏం తమాషాగా ఉందా, చిక్కులు తప్పవా ?
చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారులు జారీ చేసిన సమన్లు రద్దు చెయ్యాలని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గీతాలక్ష్మికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
గత శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్, సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్, డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గీతాలక్ష్మి తదితరుల నివాసాలు, కార్యాయాల్లో సోదాలు చేశారు.

చాలెంజ్ చేసిన గీతాలక్ష్మి
సోమవారం నుంగంబాక్కంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని మంత్రి విజయభాస్కర్, శరత్ కుమార్, గీతాలక్ష్మిలకు ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన సమన్లు రద్దు చెయ్యాలని గీతాలక్ష్మి సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చివాట్లు పెట్టిన హై కోర్టు
మంగళవారం పిటిషన్ విచారించిన మద్రాసు హైకోర్టు డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గీతాలక్ష్మికి చివాట్లు పెట్టింది. ఆమె సమర్పించిన పిటిషన్ ను కొట్టివేసింది. అసలు ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదని ఆమె తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

గట్టి ఎదురుదెబ్బ
ఆదాయపన్ను శాఖ అధికారులు జారీ చేసిన సమన్లు రద్దు చెయ్యాలని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గీతాలక్ష్మికి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో బుధవారం ఆమె ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు దిమ్మతిరిగింది
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో కుమ్మక్కు అయిన గీతాలక్ష్మి పలు కాంట్రాక్టుల విషయంలో గోల్ మాల్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆమె మీద ఐటీ శాఖ అధికారులు నిఘా వేశారు.

చిక్కులు తప్పవని అంటున్నారు
ఆదాయపన్ను శాఖ జారీ చేసిన సమన్లు రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించిన గీతాలక్ష్మికి ఇప్పుడు మరన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. బుధవారం ఆమె ఐటీ శాఖ అధికారుల ముందు హాజరుకాకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిసింది.












Click it and Unblock the Notifications