1901 తరువాత చెన్నైలో ఈ దారుణం: నాసా
వాషింగ్టన్: తమిళనాడు రాజధాని చెన్నైలో గత వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి వర్షాలు కరువలేదని, చెన్నై వాసులు గతంలోనూ ఇలాంటి వర్షాలను చూసిఉండరని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది.
1901 తరువాత 2015 డిసెంబర్ 1,2 తేదీల మద్య 24 గంటల్లో చెన్నైలో అతి భారీ వర్షం పడిందని నాసా తెలియజేసింది. ఈనెల 1,2 తేదీలలో మధ్య ఆగ్నేయ భారత్ లో కురిసిన వర్షపాతంపై నాసా యానిమేషన్ మ్యాప్ ను విడుదల చేసింది.
ఉపగ్రహం సహాయంతో చెన్నైలో వర్షపాతాన్ని అంచనా వేసింది. చెన్నైలో ఇటీవల కురిసిన భారీ వర్షాలలో ఓ ప్రాంతంలో 50 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని నాసా వెల్లడించింది.

రుతుపవనాల వల్ల ఈ సీజన్ లో డిసెంబర్ ముందే తమిళనాడులో సాధారణ శాతం కంటే ఎక్కవ వర్షపాతం నమోదు అయ్యిందని నాసా తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావం వల్ల ఇలాంటి వర్షాలు వస్తాయని చెప్పింది.
భారత్ లోని తూర్పు కోస్తా ప్రాంతాలలో ప్రతి సంవత్సరం 50 నుంచి 60 శాతం వర్షపాతం నమోదవుతుందని నాసా అంచనా వేసింది. చెన్నై నగరంతో పాటు తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా 250 మంది మరణించారు. అనేక మంది గల్లంతు అయ్యారు.












Click it and Unblock the Notifications